AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో షాకింగ్ డెసిషన్.. ట్రాన్స్‌జెండర్లకు కీలక బాధ్యతలు.. ఏంటంటే..?

హైదరాబాద్ మెట్రో ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం కొత్త సర్వీసులు ప్రవేశపెడుతోంది. ఇటీవల మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్లను అందుబాాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రయాణికులు తమ లగేజీని భద్రపర్చుకోవడానికి ఈ స్మార్ట్ లాకర్లు ఉపయోగడపనున్నాయి. తాజాగా మెట్రో మరో కొత్త నిర్ణయం తీసుకుంది.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో షాకింగ్ డెసిషన్.. ట్రాన్స్‌జెండర్లకు కీలక బాధ్యతలు.. ఏంటంటే..?
Hyderabad Metro
Venkatrao Lella
|

Updated on: Dec 02, 2025 | 11:59 AM

Share

Metro Services: హైదరాబాద్ మెట్రో ఎప్పటికప్పుడు ఏదోక కొత్త నిర్ణయం తీసుకుంటోంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణం  అందించేందుకు అనేక సౌకర్యాలు ప్రవేశపెట్టడంతో పాటు నిర్వహణపరంగా కూడా అనేక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా తాజాగా హైదరాబాద్ మెట్రో మరో నిర్ణయం తీసకుంది. 20 మంది ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డ్‌లుగా నియమించింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, మహిళలకు భద్రత కల్పించడంలో భాగంగా ఈ ముందడుగు వేసినట్లు స్పష్టం చేసింది. మహిళల భద్రతను బలోపేతం చేయడంతో పాటు వారికి గౌరవం, భరోసా కల్పించడంలో భాగంగా ఇదొక వ్యూహాత్మక ప్రయత్నంగా అధికారులు చెబుతున్నారు.

20 మంది ట్రాన్స్‌జెండర్లు ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. నేటి నుంచి ఎంపిక చేసిన స్టేషన్లు, మెట్రో రైళ్ల లోపల విధులు నిర్వర్తించనున్నారు. మెట్రో రైలు మొత్తం మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో నడుస్తోంది. రోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు సేవలను వినియోగించుకుంటున్నారు. వీరిలో దాదాపు 30 శాతం మంది మహిళలు ఉంటున్నారు. దీంతో వారికి భద్రత, సౌకర్యాలు కల్పించడంపై మెట్రో దృష్టి సారించింది. మహిళల భద్రతను బలోపేతం చేయడం వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమించడం అందులో భాగమేనని తెలుస్తోంది.

Transgenders

Transgenders

ప్రస్తుతం నియమించుకున్న వారికి మహిళా కోచ్‌లలో భద్రత కోసం ఉపయోగించుకున్నారు. మరికొంతమందిని ప్రయాణికుల బ్యాగేజ్ స్కానర్లను పర్యవేక్షించే దగ్గర ఉంచనున్నారు. ఇక కొంతమందిని ప్రయాణికులకు సమాచారం అందించడానికి వినియోగించనున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రమంతటా అందరికీ గౌరవం, సమాన అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ప్రభుత్వ బాటలోనే నడుస్తున్న మెట్రో.. ట్రాన్స్‌జెండర్లకు ఈ అవకాశం కల్పించింది. రానున్న రోజుల్లో మరికొంతమంది ట్రాన్స్‌జెండర్లను మెట్రోలో పలు సర్వీసుల్లోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్