హైదరాబాద్ జూపార్క్‌లో దొంగలు.. గంధపు చెట్లు మాయం..!
హైదరాబాద్ జూపార్క్‌లో ఆదివారం అర్థరాత్రి దొంగలు చొరబడ్డారు. జూపార్కులోని గంధపు చెట్లను నరికి తీసుకెళ్లారు. జూ అధికారులు బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంధపు చెక్కలను దోచుకెళ్లిన వారి కోసం వేట మొదలు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దొంగలు.. జంతువులకు ఎలాంటి హాని తలపెట్టలేదని, కేవలం గంధపు చెట్లను మాత్రమే నరికివేశారని పోలీసులు తెలిపారు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని అన్నారు.