Osmania University: ఓయూలో సమాధి కలకలం.. టెన్షన్‌లో విద్యార్థులు

షాకింగ్ న్యూస్. ఉస్మానియా యూనివర్శిటీలో కలకలం చెలరేగింది. ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీ వెనుక ఓ సమాధి టెన్షన్ రేపింది.

Osmania University:  ఓయూలో సమాధి కలకలం.. టెన్షన్‌లో విద్యార్థులు
Grave At Ou

Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2021 | 6:00 PM

షాకింగ్ న్యూస్. ఉస్మానియా యూనివర్శిటీలో కలకలం చెలరేగింది. ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీ వెనుక ఓ సమాధి టెన్షన్ రేపింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్టూడెంట్స్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వెనుక అటవీ ప్రాంతంలో సమాధిని చూసి భయాందోళనకు గురయ్యారు. ఏదైనా జంతువును చంపి ఇక్కడ తీసుకొచ్చి పూడ్చిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. దానిపై చల్లిన పూలు కూడా తాజాగా ఉండటంతో.. ఇటీవలే ఖననం చేసినట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన ఈసీహెచ్‌-1 హాస్టల్‌కి సమీపంలోని సమాధి ఉంది. ఓయూ క్యాంపస్ మొత్తంలో ఇప్పుడు ఈ సమాధి హాట్ టాపిక్ అయ్యింది.

క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు రాకుండా సెక్యూరిటీ గార్డులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇది భద్రతా వైఫల్యమే అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి సమాధిని తవ్వి చూస్తే గానీ లోపల ఉన్నది ఏ డెడ్‌బాడీనో తెలియదు.  అయితే ఓయూలో ఇలాంటి ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: Telangana: బార్‌లో యాక్షన్ హీరో.. డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో ‘స్వాతిముత్యం’లో కమల్ హాసన్

ఊరించి, ఉసూరుమనిపించి.. తుస్సుమన్న టమాట ధర.. కేజీ 30 రూపాయలే..