Telangana: ముగిసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరీ కుస్తీ పోటీలు.. విజేతగా ప్రకాష్ సింగ్..
కాగా, 5వ సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరీ 2024 రాష్ట్ర స్థాయి కుస్తీ ఛాంపియన్‌గా విజేత ప్రకాష్ సింగ్ నిలిచారు. ఈమేరకు ఆయనకు బహుమతిగా గోల్డ్ మెడల్, ట్రాక్ సూట్ అందించారు. మరోవైపు మహిళా కుస్తీ పోటీల్లో ఎం.శ్రావణి గెలుపొందగా, బాల్ కేసరి విజేత అయన దినేష్ సింగ్‌కు మొదటి బహుమతి ఇచ్చారు. మొత్తంగా ఈ పోటీల్లో 17 క్యాటగిరిల్లో 49 మంది విజేతలుగా తేలారు. వీరికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించినట్లు నిర్వాహకుడు రాజు పేహెల్వాన్ తెలిపారు.
5th Sardar Vallabhbhai Patel Kesari 2024 State Level Wrestling: రాజేంద్రనగర్ రాంబాగ్ మైదానంలో గత 4 రోజులుగా నిర్వహిస్తోన్న 5వ సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరీ 2024 రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలే నేటితో ముగిశాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన సుమారు 250 మంది పెహల్వాన్లు ఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్నారని నిర్వాహకుడు రాజు పేహెల్వాన్ తెలిపారు. రాంబాగ్ మైదానంలో ఈ పోటీలు జరిగినట్లు ఆయన తెలిపారు.
కాగా, 5వ సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరీ 2024 రాష్ట్ర స్థాయి కుస్తీ ఛాంపియన్‌గా విజేత ప్రకాష్ సింగ్ నిలిచారు. ఈమేరకు ఆయనకు బహుమతిగా గోల్డ్ మెడల్, ట్రాక్ సూట్ అందించారు.
మరోవైపు మహిళా కుస్తీ పోటీల్లో ఎం.శ్రావణి గెలుపొందగా, బాల్ కేసరి విజేత అయన దినేష్ సింగ్‌కు మొదటి బహుమతి ఇచ్చారు. మొత్తంగా ఈ పోటీల్లో 17 క్యాటగిరిల్లో 49 మంది విజేతలుగా తేలారు. వీరికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించినట్లు నిర్వాహకుడు రాజు పేహెల్వాన్ తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..