కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లపై క్లారిటీ ఇచ్చారు TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం. ఏప్రిల్ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కుండబద్దలు కొట్టారు. మార్చి 31 వ తేదీలోగా ఖాళీల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారాయన. ప్రభుత్వం ఇచ్చిన ఖాళీలపై కసరత్తు చేసి ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన 6 నెలల నుంచి 8 నెలల లోపే ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామన్నారు బుర్రా వెంకటేశం.
TGPSC నియామకాల్లో ఇప్పటికే ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిసారించామన్నారు TGPSC చైర్మన్ . ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతను పెంచేందుకు చర్యలు చేపడుతామన్నారు. యూపీఎస్సీలోని మంచి విధానాలను తీసుకుంటామన్నారు. పరీక్షకు ఒక్కరోజు ముందే ప్రశ్నాపత్రం తయారు చేయాలని భావిస్తున్నామన్నారాయన.
ఇక నుంచి ఏ ఏడాది ఖాళీలు ఆ ఏడాదిలోనే భర్తీ చేస్తామన్నారు బుర్రా వెంకటేశం. అభ్యర్థులకు TGPSCపై నమ్మకం పెంచేలా తమ చర్యలు ఉంటాయన్నారు బుర్రా వెంకటేశం. అవకతవకలకు తావులేకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కొత్త సంవత్సరంలో నిరుద్యోగులను నిరాశపర్చబోమన్నారు TGPSC చైర్మన్. ఈ మార్చి 31 నాటికి TGPSC దగ్గర పెండింగ్‌లో ఉన్న అన్ని ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారాయన.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి