Traffic Restrictions: వాహనదారులకు అలర్ట్‌.. ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఎందుకో తెలుసా..?

|

Aug 13, 2022 | 9:33 AM

Traffic Restrictions: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తు్న్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై.

Traffic Restrictions: వాహనదారులకు అలర్ట్‌.. ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఎందుకో తెలుసా..?
Tank Bund
Follow us on

Traffic Restrictions: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తు్న్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని మోడీ సర్కార్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా మహోత్సవంలో భాగంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్యాంకు బండ్‌పై వెళ్లేవారు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచిస్తు్న్నారు. ఈ వేడుకల సందర్భంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి చోట కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ఆర్టీసీ ట్యాంక్‌ బండ్‌పై గ్రాండ్‌ బస్‌ పరేడ్‌ను నిర్వహిస్తోంది. అందుకు సంబంధించిన ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కవాతులతో మ్యూజిక్‌ బ్యాండ్‌, బైక్‌ ర్యాలీ చేపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి