YS Sharmila New political party Name : షర్మిల పార్టీ పేరు ఇదే… పార్టీ ఏర్పాటు ముహూర్తం ఫిక్స్.. మరిన్ని వివరాలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8న ఆయన తనయ వైఎస్​ షర్మిల పార్టీ పేరును బహిరంగంగా ప్రకటిస్తారని..

YS Sharmila New political party Name : షర్మిల పార్టీ పేరు ఇదే... పార్టీ ఏర్పాటు ముహూర్తం ఫిక్స్.. మరిన్ని వివరాలు
Y S Sharmila

Updated on: Jun 08, 2021 | 1:17 PM

YS Sharmila Politics : వైయస్ షర్మిల తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తోన్న పొలిటికల్ పార్టీ పేరు “వైయస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP)”గా అధికారిక ప్రకటన వెలువడింది. పార్టీ పేరుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు సమన్వయకర్త రాజగోపాల్ ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8న ఆయన తనయ వైఎస్​ షర్మిల పార్టీ పేరును బహిరంగంగా ప్రకటిస్తారని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు. పార్టీ పేరుపై అభ్యంతరం లేదని ఎన్నికల సంఘానికి విజయమ్మ లేఖ రాసినట్లు రాజగోపాల్ వెల్లడించారు. ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా లేఖ వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని రాజగోపాల్ స్పష్టం చేశారు.

ఇలాఉండగా, తెలంగాణ పాలిటిక్స్‌లో అరంగేట్రం షురూ చేసిన వైయస్ షర్మిల రోజురోజుకూ దూకుడు పెంచుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా వాడి వేడి విమర్శల బాణాలు సైతం వదులుతున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగాలు, రైతుల వెతలు తదితర అంశాల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు షర్మిల.

త్వరలో అధికారికంగా ప్రకటించబోతోన్న తన ‘వైయస్ఆర్ తెలంగాణ పార్టీ’కి తొమ్మిది మంది అధికార ప్రతినిధులను సైతం ఇప్పటికే నియమించారు షర్మిల. వీరిలో ఇందిరా శోభన్, సయ్యద్ ముజ్జాద్ అహ్మద్, పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తేడి దేవేందర్ రెడ్డి, బీశ్వ రవీందర్, మతిన్ ముజాదద్ది, భూమిరెడ్డి ఉన్నారు.

Read also : Sanjana Galrani : అన్నార్తులకు కొవిడ్ వేళ సినీనటి సంజన గల్రానీ ఆపన్నహస్తం.. దాదాపు నెల్లాళ్లుగా ఉచిత భోజన సేవ