Rains: వద్దన్నా వదలని వానలు.. సోమ,మంగళ వారాల్లో భారీ వర్షాలకు ఛాన్స్

| Edited By: Ravi Kiran

Jul 18, 2022 | 8:42 PM

తెలంగాణను (Telangana) వర్షాలు వదలడం లేదు. ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయనుకున్న వానలు మరోసారి తీవ్ర రూపం దాల్చనున్నాయి. ఒకట్రెండు రోజులు మాత్రమే డ్యూటీ చేసిన సూర్యుడు మబ్బుల్లో దాక్కోనున్నాడు. వారం రోజులుగా కురుస్తున్న...

Rains: వద్దన్నా వదలని వానలు.. సోమ,మంగళ వారాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
Telangana Rains
Follow us on

తెలంగాణను (Telangana) వర్షాలు వదలడం లేదు. ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయనుకున్న వానలు మరోసారి తీవ్ర రూపం దాల్చనున్నాయి. ఒకట్రెండు రోజులు మాత్రమే డ్యూటీ చేసిన సూర్యుడు మబ్బుల్లో దాక్కోనున్నాడు. వారం రోజులుగా కురుస్తున్న వానలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణశాఖ ప్రకటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల అతిభారీ వర్షాలు కురిసేందుకు కారణమైన అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి (Bay of Bengal) వెళ్లి ఆదివారం మళ్లీ భూమిపైకి వచ్చిందిని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు ఒడిశా తీరంపై కేంద్రీకృతమై ఉంది. మరోవైపు.. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా సోమవారం, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వారం రోజులుగా కురిసిన వర్షాలు రెండు రోజులు విరామమిచ్చి మళ్లీ్ 16 నుంచి పుంజుకున్నాయి. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, జనగాం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మరోవైపు.. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటల తర్వాత కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. షేక్‌పేట, గోల్కోండ, టోలీచౌకీ, గచ్చిబౌలి, మాదాపూర్, లింగంపల్లి, మెహదీపట్నం, మాసబ్‌ ట్యాంక్‌, లక్డీకపూల్‌, బంజారాహిల్స్‌లో వర్షం కురిసింది. భారీ వర్షంతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లపై భారీగా వాన నీరు చేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..