మియాపూర్, మార్చి 18: హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చెడ్డీ గ్యాంగ్ శనివారం (మార్చి 16) రాత్రి చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. బ్లాక్ చెడ్డీలు ధరించి మారణాయుధాలతో స్కూల్‌లో ప్రవేశించిన అగంతకులు పాఠశాల కార్యాలయంలోని కౌంటర్‌లో ఉన్న రూ.7.85 లక్షల నగదును దోచుకెళ్లారు. చోరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మియపూర్ సీఐ దుర్గ రామ లింగ ప్రసాద్ మీడియా సమావేశంలో చెడ్డి గ్యాంగ్ అప్డేట్‌కు సంబంధించి కీలక సూచనలు చేశారు. సీఐ దుర్గ రామ లింగ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నెల 16న ఓ స్కూల్‌లో అర్ధరాత్రి చోరీ జరిగిందని ఫిర్యాదు వచ్చింది. వారి వేషధారణ అంతా చెడ్డి గ్యాంగ్‌లా ఉన్నారు. స్కూల్ లోని కౌంటర్‌లోకి చొరబడి రూ.7 లక్షల 85 వేల నగదును దోచుకెళ్లారు.
దొంగతనం దృశ్యాలు స్కూల్‌లో ఉన్న సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి. ఒంటిమీద బట్టలు లేకుండా చెడ్డీలతో దొంగలు వచ్చారు. మొత్తం ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాం. స్కూలు యాజమాన్యం లో పనిచేసే వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అని కోణంలో కూడా విచారణ చేస్తున్నాం. నిందితుల కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నాం. గతంలో కూడా చెడ్డీ గ్యాంగ్ ఈ ప్రాంతంలో చోరీలకు పాల్పడ్డారు. రానున్న రోజుల్లో సెలవులు కూడా ఉండడంతో మియాపూర్ ప్రాంత వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ’ సీఐ పేర్కొన్నారు. తమ పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన ఆయన సూచించారు.
Cheddi Gang Theft in Miyapur.#CheddiGang #CheddyGangpic.twitter.com/yUyGQaoKEc
— Milagro Movies (@MilagroMovies) March 17, 2024
కాగా హఫీజ్‌పేట్‌లోని వరల్డ్ వన్ ప్రైవేటు స్కూల్‌లో మార్చి 17 అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు దుండగులు చోరీకి యత్నించారు. చెడ్డీలు ధరించి, ముఖాలకు ముసుగు ధరించి మారణాయుధాలతో వచ్చారు. అనంతరం స్కూల్ కార్యాలయంలో ప్రవేశించి కౌంటర్‌లో ఉన్న రూ.7.85 లక్షల నగదును దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎప్పుడో వదిలి వెళ్లిపోయారనుకున్న చెడ్డీ గ్యాంగ్ నగరంలో మళ్లీ ప్రత్యక్ష్యం కవాడంతో నగర వాసులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.