
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు పగటిపూట ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోగా.. జనాలు ఎండ వేడిని, ఉక్కపోతను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాష్ట్ర ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపింది.
బుధవారం(ఏప్రిల్ 12) నుంచి రాష్ట్రంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని.. అలాగే అవసరమైతేనే తప్ప బయటికి రావొద్దని పేర్కొంది. అటు క్రింది స్థాయిలో గాలులు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తుండటంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
#24HrWx #Telangana
Temp to further rise and may exceed 40*C at many places.
Hot winds might blow over Adilabad-KumaramBheem-Nirmal-Nizamabad-Jagtial-Mancherial-Peddapalli-Bhupalapalli-Mulugu-Bhadradri-Warangal-Mahabubabad#Hyderabad
Max: 38-39*C pic.twitter.com/mlXJirlJkx— Weather@Hyderabad ?? (@Rajani_Weather) April 11, 2023