TS Home Minister Mahmood Ali: గన్‌మెన్‌ చెంప పగలగొట్టిన హోంమంత్రి మహమూద్‌ అలీ.. వీడియో వైరల్‌!

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ తన వ్యక్తిగత గన్‌మ్యాన్‌ చెంప చెళ్లుమనిపించాడు. సహనం కోల్పోయిన మంత్రి తన గన్‌మెన్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్‌ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌ అమీర్‌పేట డివిజన్‌ డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం' కార్యక్రమాన్ని మంత్రి తలసాని..

TS Home Minister Mahmood Ali: గన్‌మెన్‌ చెంప పగలగొట్టిన హోంమంత్రి మహమూద్‌ అలీ.. వీడియో వైరల్‌!
TS Home Minister Mahmood Ali

Updated on: Oct 06, 2023 | 4:23 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10: తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ తన వ్యక్తిగత గన్‌మ్యాన్‌ చెంప చెళ్లుమనిపించాడు. సహనం కోల్పోయిన మంత్రి తన గన్‌మెన్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్‌ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌ అమీర్‌పేట డివిజన్‌ డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అలాగే ఈ రోజు మంత్రి తలసాని జన్మదినం కావడంతో ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ ఆయన్ని ఆలింగనం చేసుకొని పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

అయితే మంత్రి తలసానికి శుభాకాంక్షలు చెబుతున్న సమయంలో ముందుగా ఆయన బోకే ఎక్కడ అంటూ పక్కనే ఉన్న తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. అయితే బోకే గురించి తెలియదని గన్‌ చెప్పడంతో సహనం కోల్పోయిన హోంమంత్రి మహమూద్ అలీ కానిస్టేబుల్‌ను చెంప దెబ్బ కొట్టారు. అనంతరం పక్కనే ఉన్నకొందరు బొకే అందించడంతో..  మంత్రి మహమూద్ అలీ తలసానికి శాలువా కప్పి, బొకే ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో షాక్‌కు గురైన సదరు గన్‌మెన్‌ మంత్రిని అలాగే చూస్తుండిపోగా.. మంత్రి మాత్రం తలసానిని ఆలింగనం చేసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సభలో హోం మంత్రి మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపు పలువురు విమర్శిస్తున్నారు. ఆయన హోంమంత్రి అయితే సిబ్బందితో ప్రవర్తించే తీరు ఇదేనా? ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఈ ఘటన సర్వత్రా చర్చణీయాంశమైంది. మీరూ వీడియో చూసేయండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.