AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad:హైదరాబాద్‌ మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!.. ఎందుకో తెలుసా!

హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌ మెట్రోలో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్‌ చేయడంపై అడ్వకేట్‌ నాగూర్‌ బాబు వేసిన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. మెట్రోలో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

Hyderabad:హైదరాబాద్‌ మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!.. ఎందుకో తెలుసా!
Metro
Anand T
|

Updated on: Apr 24, 2025 | 3:04 PM

Share

తెలంగాణలో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌పై కొన్నాళ్లుగా తీవ్ర దుమారం రేగుతోంది. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌ చేసిన సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయెన్సర్స్‌, సినిమా యాక్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పలువురి యాక్టర్స్‌పై కేసులు కూడా నమోదు చేసింది. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌పై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌పై సిట్‌ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలు లో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్‌పై తెలంగాణ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. మెట్రోలో బెట్టింగ్‌ ప్రమోషన్స్‌ చేయడంపై అడ్వకేట్ నాగూర్ బాబు ఈ పిల్ దాఖలు చేశారు.

అడ్వకేట్ నాగూర్ బాబు దాఖలు చేసిన పిల్‌పై విచారణ తెలంగాణ హైకోర్టు చేపట్టింది. ఈ మేరకు అడ్వకేట్‌ నాగూర్‌ బాబు కోర్టుకు తన వాదనలు విపించారు. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్స్ పై సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని పిల్‌లో పేర్కొన్నారు. రోజుకి 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలులో ఐఏఎస్, ఐపీఎస్ లు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా ఎలా ప్రమోషన్ అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.హెచ్‌ఎంఆర్‌ఎల్ లేదా అనుబంధ సంస్థలు ఇల్లిగల్ బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేయడానికి ఎన్నికోట్లు తీసుకొన్నారో ఈడీ దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరారు. రాష్ట్రంలో తెలంగాణ గేమింగ్ అమండమెంట్ యాక్ట్ 2017, అమల్లో ఉందని అడ్వకేట్ నాగూర్‌ బాబు కోర్టుకు తెలిపారు.

మరోవైపు మెట్రో రైళ్లలో 2022 తర్వాత బెట్టింగ్‌ యాప్‌ ప్రకటనలు ప్రదర్శించలేదని హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం విచారణను ఏప్రిల్‌ 29కి వాయిదా వేసింది. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు మెట్రో రైలు ఎండీకి నోటీసులు జారీ చేసింది.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతి వాదులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..