Hyderabad: వీధి కుక్కల నియంత్రణకు జిహెచ్ఎంసి చర్యలు.. యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు మార్గదర్శకాలు అమలు

|

Apr 27, 2023 | 7:48 AM

జీహెచ్‌ఎంసీ పరిధిలో కుక్కల బెడదను నియంత్రించడం, కుక్క కాటు ఘటనలను పునరావతృతం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ పటిష్ట చర్యలు చేపడుతోంది. మేయర్‌ అధ్యక్షత ఏర్పాటైన హై లెవెల్‌ కమిటీ సిఫార్సు మేరకు యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు మార్గ దర్శకాలను అనుసరించి కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది.

Hyderabad: వీధి కుక్కల నియంత్రణకు జిహెచ్ఎంసి చర్యలు.. యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు మార్గదర్శకాలు అమలు
Stray Dogs
Follow us on

ఎప్పుడైనా సరే.. ప్రజల ప్రాణాలు పోయాక సదరు ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామనే జీహెచ్‌ఎంసీ.. కుక్కకాట్ల విషయంలోనూ అలాగే సిద్ధమైంది. వీధి కుక్కల నియంత్రణకు విస్తృత చర్యలు చేపట్టింది జీహెచ్‌ఎంసి. వీధి కుక్కల బెడద నివారణకు మార్గదర్శకాల అమలుకు శ్రీకారం చుట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కుక్కల బెడదను నియంత్రించడం, కుక్క కాటు ఘటనలను పునరావతృతం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ పటిష్ట చర్యలు చేపడుతోంది. మేయర్‌ అధ్యక్షత ఏర్పాటైన హై లెవెల్‌ కమిటీ సిఫార్సు మేరకు యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు మార్గ దర్శకాలను అనుసరించి కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం జంతు సంరక్షణ కేంద్రాలు ఫతుల్లాగూడ, చుడీబజార్‌, పటేల్‌ నగర్‌, కేపీహెచ్‌బీ, మహదేవ్‌పూర్‌లో ఉండగా.. అదనంగా కాటేదాన్‌, నల్లగండ్లలో జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం చుడీబజార్‌లో ఉన్న జంతు సంరక్షణ కేంద్రం ప్రాంగణంలో అదనంగా 850 ఫీట్లు గల షెడ్‌ ఏర్పాటు చేశారు.

స్టెరిలైజేషన్‌లను పెంచడానికి అదనంగా 8 మంది ప్రైవేట్‌ పశు వైద్యులను నియమించనున్నారు. ప్రస్తుతం ఉన్న కుక్కలను పట్టుకునే వాహనాల సంఖ్యను పెంచి అందుకు అనుగుణంగా సిబ్బంది నియమించాలని నిర్ణయించారు. పాఠశాల పిల్లలకు వీధి కుక్కల ప్రవర్తనపై అవగాహన కల్పించనున్నారు. షార్ట్‌ ఫిల్మ్‌ వీడియో కాంటెస్ట్‌, ఫిల్మ్‌ యాడ్స్‌, టీవీలలో సె్లైడ్‌ షోలు థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు.

మాంసాహార విక్రయ కేంద్రాలు, వ్యాపారులు చెత్తను, వ్యర్థాలను, వీధిలో గానీ బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా వాణిజ్య వ్యర్థాలను సురక్షితంగా పారవేయడం కోసం ఆమోదించబడిన ఏజెన్సీకి అప్పగించాలని హైలెవల్‌ కమిటీ ఆదేశించింది. కుక్కల బెడదను తగ్గించడానికి స్వచ్ఛంద సేవకులు, వలంటీర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులకు వారి ప్రాంతాల్లో డాగ్‌ స్వాడ్‌ ల సమాచారాన్ని తెలియ జేయడం, తద్వారా వారు తమ ప్రాంతాల్లో 100% స్టెరిలైజేషన్‌ కోసం వీధి కుకలను పట్టుకోవడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చెత్తను సక్రమంగా పారవేసేలా.. కుక్కలు గుమిగూడకుండా ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్ల నుంచి మాంసాహార ఆహార వ్యర్థాలను ఎత్తివేసేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటుకు అడిషనల్‌ కమిషనర్‌ శానిటేషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. కుక్కల బెడదను సమర్థవంతంగా నియంత్రించడానికి, కుక్క కాటు సంఘటనలను నివారించడానికి ఉన్నత స్థాయి కమిటీ అన్ని సిఫార్సులను అమలు చేయాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..