Bonalu 2022: గోల్కొండ బోనాలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పటినుంచంటే?

| Edited By: Anil kumar poka

Jul 09, 2022 | 5:36 PM

Golkonda Bonalu 2022: ఈనెల 30నుంచి తెలంగాణలో బోనాల సందడి మొదలుకానుంది. ఎప్పటిలాగే గోల్కొండ జగదాంబిక అమ్మవారు తొలి బోనం అందుకోనున్నారు.

Bonalu 2022: గోల్కొండ బోనాలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పటినుంచంటే?
Bonalu
Follow us on

Bonalu 2022: ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో బోనాల సందడి మొదలైపోతోంది. ఆడపడుచులంతా నెత్తిన బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. పోతురాజుల కోలాహలం, శివశక్తుల పూనకంతో భక్తులు సరికొత్త ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్లిపోతారు. మొదట గోల్కొండ బోనాలతో మొదలై, ఆ తర్వాత సికింద్రాబాద్ మహంకాళి బోనాలతో పీక్‌ స్టేజ్‌కు చేరుతుంది సందడి. అనంతరం, జంట నగరాల్లో జరిగే బోనాలతో సందడి ముగుస్తుంది. ప్రతి ఏటా తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బోనాలకు అంకురార్పణ జరిగింది. ఈనెల 30నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభంకానున్నాయ్. గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించారు.

అనంతరం, ఉన్నతాధికారులతో మీటింగ్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండగలో ఎలాంటి లోపాలకు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈనెల 30న మధ్యాహ్నం 12గంటలకు గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం తరపున గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15కోట్లు మంజూరు చేసిందని మంత్రి తలసాని తెలిపారు. ఇక, సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి బోనాలు జులై 17, 18 తేదీల్లో, హైదరాబాద్‌ అంతటా జులై 24, 25 తేదీల్లో బోనాలు జరుగుతాయన్నారు.