Telangana: మన సెలవులివే.. తెలంగాణ అకాడమిక్‌ క్యాలెండర్‌ వచ్చేసిందోచ్‌..

| Edited By: Basha Shek

Jun 29, 2022 | 10:51 PM

తెలంగాణ విద్యాశాఖ (Telangana) కీలక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు, ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది....

Telangana: మన సెలవులివే.. తెలంగాణ అకాడమిక్‌ క్యాలెండర్‌ వచ్చేసిందోచ్‌..
Schools
Follow us on

తెలంగాణ విద్యాశాఖ (Telangana) కీలక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు, ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ప్రాథమిక పాఠశాలలు (Schools in Telangana) ప్రతి రోజు ఉదయం 9 గంటలు ప్రారంభమై.. సాయంత్రం నాలుగు గంటల లోపు పనిచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 నిమిషాల వరకు పనిచేస్తాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.45 నిమిషాల వరకు విధులు నిర్వహిస్తాయి. 2022-23 సంవత్సరంలో 230 పనిదినాలతో పాఠశాలలు పనిచేస్తాయని విద్యా క్యాలెండర్‌లో వెల్లడించారు.

నవంబరు 1 నుంచి 7 వరకు ఎస్ఏ 1 పరీక్షలు, 2023 ఏప్రిల్ 10 నుంచి 17 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 28లోగా పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి కావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చిలోనే పదో తరగతి పరీక్షలు పూర్తి చేస్తామని వెల్లడించారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9 వరకు 14 రోజులు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 22 నుంచి 28 వరకు క్రిస్ మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయని ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

విద్యా, ఉద్యోగం వార్తల కోసం