Telangana cabinet: ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ మీటింగ్.. పలు కీలక అంశాలపై చర్చ..

|

Sep 16, 2021 | 9:34 AM

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వరి, బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలుపై చర్చించనున్నారు.

Telangana cabinet: ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ మీటింగ్.. పలు కీలక అంశాలపై చర్చ..
Cm Kcr
Follow us on

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వరి, బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలుపై చర్చించనున్నారు. రైతులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దళితబంధు అమలు విషయంలో కొత్తగా 4 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద నిధుల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్‌ . దాంతోపాటు నీటి పంపకాలు, అంతర్రాష్ట్ర జలవివాదాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, దళిత బంధు, వరి సాగు పై జరుగబోతోన్న క్యాబినెట్ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ప్రగతిభవన్‌‌లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ఈ సందర్భంగా శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాల తేదీల ఖరారుతో పాటు దళితబంధు, వరికి ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం తదితర అంశాలపై చర్చించనున్నారు. గత మార్చి 25న శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. మళ్లీ ఆరు నెలల్లోపు అంటే ఈ నెల 25వ తేదీలోగా ఉభయసభల సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ లోగా సమావేశాలను ప్రారంభించేలా ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం ఈ నెల 19తో ముగియనుంది. ఆ తర్వాత 1-2 రోజుల విరామం అనంతరం సమావేశాలను ప్రారంభించాలనే అంశంపై ఇప్పటికే చర్చ నడుస్తోంది. సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల అంశాన్ని కూడా ఖరారు చేస్తారు. దళితబంధు పథకంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వాసాలమర్రిలో ప్రారంభించిన ఈ పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఆ తర్వాత మధిర, తుంగతుర్తి, అచ్చంపేట-కల్వకుర్తి, జుక్కల్‌ నియోజకవర్గాల్లోని చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్‌ మండలాల్లో ప్రయోగాత్మకం (పైలట్‌ ప్రాజెక్టు)గా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు, నిధుల మంజూరుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.

ఇవికూడా చదవండి: Saidabad rape and murder: కీచకుడి మారువేశాలు.. ఇలా మనకు సమీపంలో ఉంటే గుర్తు పట్టండి.. జస్ట్ కాల్ చేయండి అంతే..

Gujarat New Cabinet: మంత్రివర్గ కొత్త కూర్పుపై ప్రధాని మోడీ, అమిత్‌షా మార్క్‌.. 27 మందితో గుజరాత్‌లో కొత్త కేబినెట్‌..