AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడే కొత్త సచివాలయం

ఇప్పుడు ఉన్న సచివాలయం స్థానంలోనే కొత్త సచివాలయ నిర్మాణ పనుల్ని చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం 4 నుంచి 5 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చే విధంగా.. కొత్త సచివాలయానికి డిజైన్ ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ఏర్పాటైన తరువాత అధికారం చేపట్టిన కేసీఆర్‌ సర్కారు కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. […]

అక్కడే కొత్త సచివాలయం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 06, 2019 | 10:10 AM

Share

ఇప్పుడు ఉన్న సచివాలయం స్థానంలోనే కొత్త సచివాలయ నిర్మాణ పనుల్ని చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం 4 నుంచి 5 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చే విధంగా.. కొత్త సచివాలయానికి డిజైన్ ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ఏర్పాటైన తరువాత అధికారం చేపట్టిన కేసీఆర్‌ సర్కారు కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సచివాలయం స్థానంలోనే కొత్తది నిర్మించాలనే ప్రతిపాదన మొదటి నుంచే ఉండేది. కానీ విభజన నేపథ్యంలో సచివాలయంలోని కొన్ని బ్లాకులు ఏపీ ఆధీనంలోకి వెళ్లాయి. వాటిని తమకు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం కోరగా.. అందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించింది. అందులో భాగంగా సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో గ్రౌండ్‌లో సచివాలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఇక ఆ భూమి కేటాయింపు కోసం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది. కానీ దానిపై కేంద్రం ఎటూ తేల్చలేదు. ఇక తాజాగా ఏపీలో ప్రభుత్వం మారడం.. సచివాలయ భవనాలన్నీ తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి రావడంతో అక్కడే సచివాలయాన్ని నిర్మించాలని సీఎం నిర్ణయానికి వచ్చారు. ఇక ఏడాది, ఏడాదిన్నరలోగా ఈ కొత్త సచివాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకయ్యే అంచనా వ్యయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..