Chandrababu: హైదరాబాద్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు..

| Edited By: TV9 Telugu

Nov 02, 2023 | 4:24 PM

Chandrababu Hyderabad Visit: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై ఆరోగ్య కారణాలతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌ నగరానికి చేరకున్న చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌ వచ్చారు.

Chandrababu: హైదరాబాద్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు..
Chandrababu
Follow us on

Chandrababu Hyderabad Visit: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై అనారోగ్య కారణాలతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌ నగరానికి చేరకున్న చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌ వచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు. అనంతరం బాబు వాహన శ్రేణికి ముందు టీడీపీ కార్యకర్తలు టీడీపీ జెండాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు ఉండవల్లి నుంచి చంద్రబాబు బయలుదేరిన సమయంలో కొందరు టీడీపీ అభిమానులు ఆయన ప్రయాణించే దారిలో గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీశారు. విజయవాడలో అభిమానులు చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు తెలిపారు.

చంద్రబాబు వీడియో..

సీఐడీ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు తీర్పు

ఇదిలాఉంటే.. మధ్యంతర బెయిల్‌పై ఉన్న చంద్రబాబు వెంట ఇద్దరు డీఎస్పీలు ఉండాలన్న ఏపీ సీఐడీ పిటిషన్‌పై బాబు తరపు న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేశారు. Z కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు వెంట డీఎస్పీలు ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టుకు తెలిపారు. చంద్రబాబు కదలికలు తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ ఉండనే ఉంటుందని పేర్కొన్నారు. అదే సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారని, విజయవాడకు ర్యాలీగా వచ్చారని సీఐడీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్‌ను పెన్‌డ్రైవ్‌లో కోర్టుకు సమర్పించారు. ఇది హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని వాదించారు.

అయితే, బాబు ఎక్కడా కోర్టు ఆదేశాలు అతిక్రమించలేదని బాబు తరపు న్యాయవాదులు వెల్లడించారు. బాబు మాట్లాడటమన్నది ప్రాథమిక హక్కులో భాగమే తప్ప అతిక్రమణ కాదని అన్నారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. మరో వైపు చంద్రబాబుపై నమోదు చేసిన కేసులకు సంబంధించి అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, సీఐడీ చీఫ్‌ సంజయ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మీడియాతో మాట్లాడటంపై బాబు తరపున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ ముందు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. దీనిపై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..