Telangana: “లిస్ట్ చాలా పెద్దగా ఉంది.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం”.. తరుణ్ ఛుగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలంగాణ (Telangana) బీజేపీ నేతలు ఢిల్లీకి వరస కట్టారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నేతలతో కలిసి హస్తినకు వెళ్లి పార్టీ పెద్దల్ని కలిశారు. శుక్రవారం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన దాసోజు శ్రవణ్‌ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి..

Telangana: లిస్ట్ చాలా పెద్దగా ఉంది.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం.. తరుణ్ ఛుగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Tarun Chugh
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 06, 2022 | 9:35 PM

తెలంగాణ (Telangana) బీజేపీ నేతలు ఢిల్లీకి వరస కట్టారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నేతలతో కలిసి హస్తినకు వెళ్లి పార్టీ పెద్దల్ని కలిశారు. శుక్రవారం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన దాసోజు శ్రవణ్‌ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి తీసుకెళ్లారు. రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌తో (Tharun Chug) భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. రాజగోపాల్‌రెడ్డి, శ్రవణ్‌తోపాటు పార్టీలోకి వచ్చే వారిపై బండి సంజయ్‌, తరుణ్‌ ఛుగ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. లిస్ట్‌ చాలా పెద్దగా ఉందని, త్వరలోనే అందరి పేర్లు చెబుతామని తరుణ్‌ఛుగ్‌ వెల్లడించారు. ఇది ట్రైలర్‌ మాత్రమేనని, అసలు సినిమా ఇంకా ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు కాంట్రాక్ట్‌లు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని కాంగ్రెస్‌ (Congress) చేస్తున్న విమర్శలపై రియాక్ట్‌ అయ్యారు బండి సంజయ్‌. రాజకీయాల్లోకి రాకముందే రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టర్‌ అని చెప్పారు. కాంట్రాక్ట్‌లు ఇచ్చి చేర్చుకునే కల్చర్‌ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లోనే ఉంటుందని విమర్శించారు. మరోవైపు.. ఢిల్లీలోనే ఉన్న రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నేతలతో చర్చించారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా, తరుణ్‌ఛుగ్‌, లక్ష్మణ్‌ లతో భేటీ అయ్యారు. చౌటుప్పల్‌లో అమిత్‌షా సభకు ప్లాన్‌ చేస్తున్నారు. హోంమంత్రి అమిత్‌షా వచ్చేలోపు మరింత మందిని పార్టీలోకి చేర్పించుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

కాగా.. కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ నెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో ఇచ్చిన రాజీనామాను ఈనెల 8న అసెంబ్లీ స్పీకర్ ను కలిసి ఆమోదింపజేసుకుంటానని వెల్లడించారు. భవిష్యత్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం ఉన్నవారు కాంగ్రెస్‌ పార్టీలో ఉండరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..