Hyderabad: గాంధీ ఆస్పత్రి రేప్‌ మిస్టరీ.. వీడని చిక్కుముడి.. ఘటనపై సర్కార్ సీరియస్

|

Aug 18, 2021 | 3:52 PM

చిక్కుముడి వీడడం లేదు. సస్పెన్స్‌కు తెరపడడం లేదు. రేప్‌ మిస్టరీపై ఓ క్లారిటీ రావడం లేదు. ధర్మాస్పత్రి దాష్టీకంపై దర్యాప్తు ఎటూ తేలడం లేదు. గాంధీ ఆస్పత్రి....

Hyderabad: గాంధీ ఆస్పత్రి రేప్‌ మిస్టరీ.. వీడని చిక్కుముడి.. ఘటనపై సర్కార్ సీరియస్
Gandhi Hospital
Follow us on

చిక్కుముడి వీడడం లేదు. సస్పెన్స్‌కు తెరపడడం లేదు. రేప్‌ మిస్టరీపై ఓ క్లారిటీ రావడం లేదు. ధర్మాస్పత్రి దాష్టీకంపై దర్యాప్తు ఎటూ తేలడం లేదు. గాంధీ ఆస్పత్రి ఘటనలో మరో బాధితురాలి ఆచూకీ ఇంకా లభించలేదు. ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు చిలకలగూడ పోలీసులు.  ఈ నెల 7 వ తేదీ నుండి 15వ తేదీ వరకు అక్కా-చెల్లెలు ఎక్కడున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కోనసాగిస్తున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉమామహేశ్వర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో అతడు నోరు మెదపడం లేదు. గాంధీ ఆస్పత్రి సీసీ కెమెరాల్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. ఘటనపై సీరియస్‌గా దృష్టిసారించింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని హోంమంత్రి మహమూద్‌అలీ పోలీసులను ఆదేశించారు. ఆస్పత్రిలో రోగి చికిత్స పొందిన పరిస్థితులు, ఫిర్యాదిదారు ఇచ్చిన సమాచారం విరుద్ధంగా ఉండడంతో పోలీసులు ఆ దిశగా దృష్టిసారించారు. అత్యాచారం జరిగిందని చెబుతున్న మహిళకు మెడికల్ టెస్టులు చేశారు. ఆ రిపోర్ట్ వస్తే మిస్టరీ వీడే అవకాశముంది. మరోవైపు.. గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల దర్యాప్తునకు తోడు ఆస్పత్రి సిబ్బందిపై ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు సమగ్ర విచారణకు ఆదేశించారు గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు.

కిడ్నీ ట్రీట్‌మెంట్‌ కోసం మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్తను ఈ నెల 5న గాంధీకి తీసుకొచ్చారు. వెంట ఆమె చెల్లెలు కూడా వచ్చారు. వాళ్లకు దూరపు బంధువైన ఉమామహేశ్వర్‌.. గాంధీలో టెక్నీషియన్‌. అతను, సెక్యూరిటీ గార్డు మరికొందరు కలిసి అత్యాచారినికి పాల్పడ్డారన్న బాధితురాలి ఫిర్యాదుతో చిలకలగూడ పీఎస్‌లో కేసు రిజిస్టరైంది. ఐతే ఆమె సోదరి కన్పించకుండా పోవడం మిస్టరీగా మారింది. ఒకవైపు పోలీసులతో పాటు మరోవైపు ఆస్పత్రిలో అంతర్గత విచారణ కొనసాగుతుండటంతో త్వరలోనే కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: మొదట ‘అయ్యా’ అంటూ దొంగ బాబా కాళ్లు మొక్కారు.. తర్వాత ‘నీ అయ్య’ అంటూ బెండుతీశారు

 కొబ్బరికాయల లోడేలే అనుకున్నారు.. ఫార్మల్‌గా చెక్ చేశారు.. పోలీసుల మైండ్ బ్లాంక్