హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో హైడ్రామా చోటు చేసుకుంది. రెండు చిత్రాల ప్రదర్శన కోసం యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు పోటీపడ్డాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య వామపక్ష విద్యార్థి సంఘం అయిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI) కార్యకర్తలు బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ని హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శించారు. లేడీస్ హాస్టల్‌లో ఈ డాక్యుమెంటరీని ప్లే చేశారు. అదే సమయంలో ఏబీవీపీ కార్యకర్తలు కశ్మీర్ ఫైల్స్ సినిమాను నార్త్ బ్లాక్‌లో చూపించారు. భారత ప్రభుత్వం నిషేధించిన ఈ డాక్యుమెంటరీని యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శించడం సరికాదంటూ యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఏబీవీపీ కార్యకర్తలు.
అంతకు ముందు కాసేపు హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీబీసీ వీడియో ప్లే చేసేందుకు SFI విద్యార్థుల సిద్ధమవ్వగా.. పోటీగా కశ్మీర్‌ఫైల్స్ ప్రదర్శించేందుకు ABVP నేతలు ప్రయత్నించారు. అయితే ఏబీవీపీ కార్యకర్తలను భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో హైటెన్షన్ క్రియేట్ అయ్యింది. వర్సిటీ యాజమాన్యం లెఫ్ట్ యూనియన్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ABVP కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భద్రత పెంచారు.
One again student groups defying the ban of the #BBCDocumentary on #PMModi ‘India: The Modi question’, in #HyderabadCentralUniversity,#SFI calls for screening on #RepublicDay, and #ABVP counters by screening of #TheKashmirFiles simultaneously in the #UoH campus.#Hyderabad #HCU pic.twitter.com/644agVasvU
— Surya Reddy (@jsuryareddy) January 26, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..