Viral Video: పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడిలా మారిన వీధికుక్కలు.

Hyderabad dog attack : హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకూ వీధికుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నెల మొదటి వారంలో హిమాయత్‌నగర్, మన్‌సూరాబాద్‌లోని శివశక్తి కాలనీలో 8 ఏళ్ల మూగ బాలుడిపై జరిగిన వీధికుక్కల దాడి మరవక ముందే యూసఫ్‌గూడాలో మరో ఘటన వెలుగు చూసింది.

Viral Video: పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడిలా మారిన వీధికుక్కలు.
Viral Video

Updated on: Dec 05, 2025 | 6:27 PM

హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకూ వీధికుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నెల మొదటి వారంలో హిమాయత్‌నగర్, మన్‌సూరాబాద్‌లోని శివశక్తి కాలనీలో 8 ఏళ్ల మూగ బాలుడిపై జరిగిన వీధికుక్కల దాడి మరవక ముందే యూసఫ్‌గూడాలో మరో ఘటన వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బుడ్డోడిపై వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. సమయానికి ఇంట్లోని వ్యక్తి వచ్చి దాన్ని తరిమేయడంతో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని శ్రీలక్ష్మీనరసింహనగర్‌ కాలనీకి చెందిన మాన్వీత్‌ నందన్‌ అనే రెండేళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో వాళ్ల ఇంటి ముందు ఒక వీధికుక్క వెళ్తోంది. అయితే బాలుడి చూసి ఆ వీధికుక్క ఒక్కసారిగా ఆ బుడ్డోడిపైకి దూసుకొచ్చింది. అతన్ని చేతిని పట్టి లాగే ప్రయత్నిం చేసింది. అది గమనించిన చిన్నారి తాతయ్య వెంటనే ఇంట్లో నుంచి బటయకు వచ్చి కుక్కను కర్రతో తరిమేశాడు. దీంతో అది అక్కడి నుంచి పారిపోయింది.

అయితే కుక్క దాడితో పాటు.. వాళ్ల తాతయ్య దాన్ని కొట్టే సమయంలో బాలుడికి కూడా చిన్నగా గాయలయ్యాయి. దీంతో బాలుడిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు నగరంలో వరుసగా వీధి కుక్కల దాడులు జరుగుతున్నా, ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.