Munawar Faruqui Show: కమెడియన్‌ మునావర్‌ ఫారుఖీ షోకి పోలీసుల అనుమతి.. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేవైఎం

Faruqui show: మునావర్‌ ఫారుఖీ షోకి అనుమతి లభించింది. శనివారం శిల్పకళా వేదికలో ఈ షో నిర్వహించారు. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Munawar Faruqui Show: కమెడియన్‌ మునావర్‌ ఫారుఖీ షోకి పోలీసుల అనుమతి.. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేవైఎం
Munawar Faruqui
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 19, 2022 | 2:38 PM

హైదరాబాద్‌లో ప్రముఖ కమెడియన్‌ మునావర్‌ ఫారుఖీ షోకి అనుమతి లభించింది. శనివారం శిల్పకళా వేదికలో ఈ షో నిర్వహించనున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలావుంటే మునావర్‌ ఫారుఖీ షోని అడ్డుకుంటామని బీజేవైఎం నేతలు ఇప్పటికే హెచ్చరించారు. మునావర్‌ షోకి అనుమతి ఇవ్వొద్దని కోరుతూ తెలంగాణ డీజీపీని కలిసి వినతి పత్రం ఇచ్చారు బీజేవైఎం నేతలు. హిందు దేవుళ్లను కించపరిచే విధంగా మునావర్‌ షోలో కామెంట్స్ ఉంటోంది బీజేవైఎం. ఈ కార్యక్రమం ద్వారా కమ్యూనల్‌ వయలెన్స్‌ జరిగే అవకాశం ఉందని వారు ఫిర్యాదు చేశారు. అనుమతి ఇస్తే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

మునావర్ ఫరూఖీ ఎవరు..?

మునావర్ ఫరూఖీ గుజరాత్‌ ఇండియన్ ముస్లిం కుటుంబానికి చెందిన ఓ స్టాండప్ కమెడియన్.. దావూద్, యమరాజ్ అండ్ ఔరత్ అనే కామెడీ వీడియోతో మునావర్ తన తొలి ప్రదర్శన మొదలు పెట్టాడు. కంగనా రనౌత్ రియాలిటీ షో లాక్ అప్ టైటిల్ విజేతగా గెలిచి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఇండోర్‌లో స్టాండప్ కామెడీ షో ఆరంభించినప్పటి నుంచి బీజేపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

హిందూ దేవీ దేవతల్ని హేళన చేస్తూ కామెడీ చేయడమే ఇతని స్పెషాలిటీ.. హిందూ దేవతలతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మీద కూడా జోకులు పేల్చుతుండటంతో బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

ఇదిలావుంటే.. గత ఏడాది హైదరాబాద్‌లో షో చేసి వెళ్లి.. మధ్యప్రదేశ్‌లో మరో షో చేస్తుండగా హేట్ స్పీచ్ నేరంపై పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ వస్తున్నాడని తెలిసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం