Hyderabad: ఉపరితల ఆవర్తనం ప్రభావం.. తెలంగాణలో ఈ జిల్లాలకు 2 రోజులు వర్షాలు..

| Edited By: Ravi Kiran

Jun 08, 2024 | 9:39 PM

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నిజామాబాద్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతా.. ఆ వివరాలు ఇలా..

Hyderabad: ఉపరితల ఆవర్తనం ప్రభావం.. తెలంగాణలో ఈ జిల్లాలకు 2 రోజులు వర్షాలు..
Rain Alert
Follow us on

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నిజామాబాద్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరిస్తాయని హైదారబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు భారీ వర్షసూచన చేసింది. దక్షిణ ఈశాన్య, మధ్య తెలంగాణ జిల్లాలకు తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

హైదరాబాద్‌కి ఉరుములు, మెరుపులతో పాటు.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు. మరోవైపు రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మేఘాలు కమ్ముకొని.. పలు చోట్ల వాన కురిసింది. మియాపూర్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, చార్మినార్‌, కోఠి, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బాలానగర్ బేగంపేట, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఓ మై గాడ్.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంట్రా.. కింగ్ కోబ్రా ముందు కుప్పిగంతులా..

రోడ్లన్ని జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌కి భారీ వర్ష సూచన చేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై నిలిచిపోయిన వరద నీటిని క్లీయర్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ డీఆర్ఎప్ సిబ్బంది. డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఆర్ఎఫ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఇది చదవండి: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..