Summer: ఈ సమ్మర్‌లో మీ చిన్నారులను ఇలా ఎంగేజ్‌ చేయండి.. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సమ్మర్‌ క్యాంప్‌

|

Apr 27, 2023 | 5:47 PM

వేసవి సెలవులు వచ్చేశాయ్‌. మొన్నటి వరకు పరీక్షలు, పుస్తకాలతో కుస్తీలు పడ్డ విద్యార్థులు ప్రస్తుతం హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే చిన్నారులు ఖాళీగా ఉండే ఈ సమయాన్ని ఏదైనా నేర్చుకోవడానికి ఉపయోగిస్తే బాగుంటుంది కదూ. కానీ ప్రైవేటు సంస్థలు విపరీతంగా ఫీజులు వసూలు చేస్తుంటాయి. అయితే..

Summer: ఈ సమ్మర్‌లో మీ చిన్నారులను ఇలా ఎంగేజ్‌ చేయండి.. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సమ్మర్‌ క్యాంప్‌
SCR Summer Camp
Follow us on

వేసవి సెలవులు వచ్చేశాయ్‌. మొన్నటి వరకు పరీక్షలు, పుస్తకాలతో కుస్తీలు పడ్డ విద్యార్థులు ప్రస్తుతం హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే చిన్నారులు ఖాళీగా ఉండే ఈ సమయాన్ని ఏదైనా నేర్చుకోవడానికి ఉపయోగిస్తే బాగుంటుంది కదూ. కానీ ప్రైవేటు సంస్థలు విపరీతంగా ఫీజులు వసూలు చేస్తుంటాయి. అయితే దక్షిణ మధ్య రైల్వే తక్కువ ధరలోనే చిన్నారుల కోసం సమ్మర్‌ క్యాంప్‌ను నిర్వహిస్తుంది.

దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. మే 1వ తేదీ నుంచి జూన్‌ 4వ తేదీ వరకు ఈ క్యాంక్‌ ఉండనుంది. రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ (ఆర్ ఎస్ సి ) గ్రౌండ్స్ సికింద్రాబాద్ వేదికగా ఈ శిక్షణ శిబిరం ఉండనుంది. ఈ వేసవి శిక్షణ శిబిరంలో 16 ఏళ్లలోపు పిల్లలకు అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డీ విభాగాల్లో శిక్షణ ఇస్తారు.

ఇవి కూడా చదవండి

ఇక 20 ఏళ్లు పైబడిన పెద్దలకు ప్రాథమిక ఫిట్‌నెస్ శిక్షణ / యోగా శిక్షణ ఉంటుంది. ఉదయం 06.00 నుంచి 08.30 వరకు ఉంటుంది. ఆసక్తి గల వ్యక్తులు స్పోర్ట్స్ ఆఫీస్, రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ నుంచి దరఖాస్తు ఫారమ్‌లను పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం 9866147148 / 040 – 27785334 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలి.

 

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..