సమ్మర్ హాలీడేస్ లో రైల్లో ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 19 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్(Secunderabad) రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి, కాకినాడ, బరంపూర్, నర్సాపూర్, తిరుపతి నుంచి సికింద్రాబాద్, విజయవాడ నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్(Hyderabad) నుంచి నర్సాపూర్, కాచిగూడ నుంచి తిరుపతి నగరాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. 07438 / 07437 నంబర్ గల సికింద్రాబాద్–తిరుపతి రైలు 13వ తేదీ సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి, తిరుగు ప్రయాణంలో 14వ తేదీ సాయం త్రం 7.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. 07468 / 07469 స్పెషల్ ట్రైన్13వ తేదీ రాత్రి 8.45 గంటలకు సికింద్రాబాద్ లో ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్–బరంపూర్ రైలు.. 13 సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్ లో, 14వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు బరంపూర్ లో బయలుదేరుతుంది. సికింద్రాబాద్–నర్సాపూర్ ట్రైన్ 15 రాత్రి 10.35 గంటలకు.. 17రాత్రి 8 గంటలకు నర్సాపూర్ లో బయలుదేరుతుంది. 07585 తిరుపతి–సికింద్రాబాద్ రైలు.. ఈ నెల 17 సాయంత్రం 7.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
07583/07584 నంబర్ గల తిరుపతి–సికింద్రాబాద్ రైలు..15వ తేదీ రాత్రి 9 గంటలకు తిరుపతిలో ప్రారంభమవుతుంది. విజయవాడ – సికింద్రాబాద్ (07441) రైలు ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మర్నాడు ఉదయం 4.10 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. హైదరాబాద్ – నర్సాపూర్ (07477/07478) 13వ తేదీ సాయంత్రం 4.55 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 14వ తేదీ ఉదయం 7 గంటలకు నర్సాపూర్ నుంచి మొదలు అవుతుంది. కాచిగూడ–తిరుపతి (07297/07298) రైలు 13 రాత్రి 10.20 గంటలకు కాచిగూడలో, 14 మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది.
Also Read
AP: సర్పంచ్ బండి రమేష్ పాడే మోసిన మంత్రులు.. కుటుంబ సభ్యులకు ఓదార్పు..
Yash: యశ్ క్రేజ్ అంటే ఇట్లుంటది మరి.. 20 వేల పుస్తకాలతో ఫ్యాన్స్ వరల్డ్ రికార్డ్..