Hyderabad News: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా లైఫ్‌ స్టార్ట్‌ చేసి.. డ్రగ్స్‌ పెడ్లర్‌గా మారాడు.. కట్‌చేస్తే…

హైదరాబాద్‌ మైలార్‌దేపల్లి పీఎస్‌ పరిధిలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు ఓ యువకుడు. నిందితుడి నుంచి సుమారు. 23.3 గ్రాములు ఎండీఎంఏ డ్రగ్స్‌ స్వాదీనం చేసుకున్న పోలీసులు అతన్ని పీస్‌కు తరలించారు. అయితే గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేసిన వెంకట జగద్వీశ్వర్‌ రెడ్డి.. ఉద్యోగం కోల్పోవడంతో డ్రగ్స్‌ దందాలోకి అడుగుపెట్టినట్టు పోలీసులు గుర్తించారు.

Hyderabad News: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా లైఫ్‌ స్టార్ట్‌ చేసి.. డ్రగ్స్‌ పెడ్లర్‌గా మారాడు.. కట్‌చేస్తే...
Drug Peddler

Edited By:

Updated on: Jun 25, 2025 | 10:08 PM

ఐటీ ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించిన ఓ యువకుడు మళ్లీ మాదకద్రవ్యాల కుంభకోణంలో చిక్కాడు. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న సమయంలో శంషాబాద్ ఎక్సైజ్‌ విభాగం అధికారులు అతన్ని అరెస్టు చేశారు. అరెస్టైన వ్యక్తి వయస్సు 25 సంవత్సరాలు కాగా, ఇతడి పేరు వెంకట జగదీశ్వర రెడ్డి అని అధికారులు తెలిపారు. అయితే ఇతను గతంలో బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసేవాడని.. అక్కడ ఉద్యోగం కోల్పోవడంతో డ్రగ్‌ల వరల్డ్‌లోకి అడుగుపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే మాదకద్రవ్యాల విక్రయ కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

గత ఏడాది 2024 ఫిబ్రవరి లోనూ డ్రగ్స్‌ విక్రయిస్తూ వెంకట జగద్వీశ్వర్‌ రెడ్డిని ఎక్సైజ్‌ అధికారులకు పట్టుబడ్డాడని, అప్పుడు అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వెంకట్‌ నుంచి 18 గ్రాముల ఎమ్‌డిఎమ్‌ఏ (MDMA), 53 గ్రాముల OG కుష్, 1.2 కిలోల గంజాను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అనతరం అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు జైల్‌లో వేయగా గత మే నెలలో జైలు నుంచి విడుదలయ్యాడని తెలిపారు.

అయితే జైలు నుంచి విడుదలైన జగదీశ్వర్ రెడ్డి మళ్లీ డ్రగ్స్‌ దందాను స్టార్ట్‌ చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా డ్రగ్స్‌ విక్రయిస్తుండగా ఎక్సైజ్ అధికారులు మైలార్‌దేవ్‌పల్లిలో మెహఫిల్ హోటల్ సమీపంలో జగదీశ్వర్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద 23.3 గ్రాముల ఎమ్‌డిఎమ్‌ఏను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన సప్లయర్‌ సైఫ్ షరీఫ్ వద్ద నుంచి రెడ్డి ఒక్క గ్రామును ₹1,500కు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో వినియోగదారులకు రూ.5,000 నుంచి రూ.8,000 వరకు విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్‌ శాఖ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..