Hyderabad: శంషాబాద్‌లో హత్య.. సరూర్‌నగర్‌ మ్యాన్‌హోల్‌లో డెడ్‌బాడీ.. ప్రియురాలిని హత్య చేసిన..

|

Jun 09, 2023 | 12:35 PM

Shamshabad Murder: సుల్తాన్‌పల్లిలో శుక్రవారం ఉదయం దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు అప్సరను ప్రియుడు సాయికృష్ణ చంపి మ్యాన్‌హోల్‌లో పడేశాడు. అప్సర కనిపించడంలేదని పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు

Hyderabad: శంషాబాద్‌లో హత్య.. సరూర్‌నగర్‌ మ్యాన్‌హోల్‌లో డెడ్‌బాడీ.. ప్రియురాలిని హత్య చేసిన..
Shamshabad Murder
Follow us on

హైదరాబాద్, జూన్ 09: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లిలో శుక్రవారం ఉదయం దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు అప్సరను ప్రియుడు సాయికృష్ణ చంపి సరూర్‌నగర్ మ్యాన్‌హోల్‌లో పడేశాడు. అప్సర కనిపించడంలేదని పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ప్రియుడు సాయికృష్ణ హంతకుడిని పోలీసులు తేల్చారు. జూన్ 3న అప్సరను ప్రియుడు హత్య చేసినట్లు గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

శంషాబాద్‌ అప్సర హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అప్సరను దారుణంగా హత్యచేసింది మేనమామ సాయికృష్ణ అని తేలింది. శంషాబాద్‌లో హత్య చేసి సరూర్‌నగర్‌లోని ఓ మ్యాన్‌హోల్‌లో పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అప్సరను హత్యచేసి మిస్సింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు సాయికృష్ణ. ఈనెల 3న స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లాలనుకుంది అప్సర. అప్సరకు తానే సెండాఫ్‌ ఇచ్చినట్లు మేనమామ చెప్పాడు. శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద దించినట్లుగా నిందితుడు ముందుగా చెప్పాడు.

స్నేహితులతో కలిసి అప్సర భద్రాచలం బయల్దేరిందని పోలీసుకు ఫిర్యాదు చేసి విషయాన్ని పక్కదోపట్టించాలని ప్రయత్నించాడు. అప్పటి నుంచి అప్సర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మేనమామ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈనెల 5న పీఎస్‌కి వెళ్లి అప్సర కనిపించడంలేదని సాయికృష్ణ పెద్ద డ్రామా ఆడటం మొదలు పెట్టాడు. దీంతో సీసీటీవీ ఫుటేజీ, కాల్‌ డేటా ఆధారంగా డ్రామాకు తెరదించారు పోలీసులు. మేనమామ సాయికృష్ణే హంతకుడని తేల్చారు పోలీసులు. పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు సాయికృష్ణ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం