MLA Sri Ganesh: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నం.. ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్పై గుర్తు తెలియని దుండగులు దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపంది. ఆదివారం బోనాల సందర్భంగా మాణికేశ్వర్ నగర్లోని ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి వెళుతుండగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఆయన వాహనంపై దాడి చేశారు.ఈ ఘటనపై ఎమ్మెల్యే శ్రీగణేష్ ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

MLA Sri Ganesh: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నం.. ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు!
Mla Sri Ganesh

Updated on: Jul 21, 2025 | 8:18 AM

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడి కలకలం రేపింది. నిన్న రాత్రి సికింద్రాబాద్‌ నుంచి మాణికేశ్వరినగర్‌లో బోనాల పండగకు హాజరయ్యేందుకు వెళుతుండగా కొందరు యువకులు దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఓయూ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే శ్రీగణేష్‌. ఆ తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి పోలీస్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే ద్వారా వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని త్వరగా పట్టుకోవాలని పోలీసులకు సూచించారు.

కొంతమంది తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తన దగ్గర సమాచారం ఉందన్నారు కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇప్పుడు జరిగిన దాడి కూడా దానికి సంబంధించేనా? లేదా మరోటా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతేందన్నారు.

రాత్రి 9 గంటల తర్వాత ఈ దాడి జరిగినట్టు ఓయూ పోలీసులు చెబుతున్నారు. తార్నాక నుంచి మాణికేశ్వరినగర్‌కు వస్తున్న సమయంలో RTC హాస్పిటల్‌ దాటిన తర్వాత కొందరు యువకులు ఎమ్మెల్యేపై ఎటాక్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. దాడి తర్వాత ఆ యువకులు అడిక్‌మెట్‌ వైపు వెళ్లారని, సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓయూ పోలీసులు తెలిపారు.

ఎమ్మెల్యే పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కంప్లైంట్ కాపీ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.