సనా కేసులో సంచలన విషయాలు.. ఈడీ వండర్
మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఇటీవల అరెస్టు చేసిన హైదరాబాదీ బిజినెస్ మన్ సతీష్ బాబు సనా తాను కూడా ఓ లలిత్ మోడీలా కావాలనుకున్నాడట. వివాదాస్పదుడైన మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీతో ఇతనికి ఉన్న లింక్, కోట్లాది రూపాయల లావాదేవీలు తెలిసిందే. ఏపీలో ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒకప్పుడు చిన్న ఉద్యోగి అయిన ఈయన.. పలు పార్టీల నేతలు, క్రికెటర్లతోసాన్నిహిత్యం పెంచుకుని ఏకంగా బీసీసీఐ లోనే పదవి పొందాలని ప్లాన్ వేశాడట. సనాను జులై 26 న […]
మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఇటీవల అరెస్టు చేసిన హైదరాబాదీ బిజినెస్ మన్ సతీష్ బాబు సనా తాను కూడా ఓ లలిత్ మోడీలా కావాలనుకున్నాడట. వివాదాస్పదుడైన మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీతో ఇతనికి ఉన్న లింక్, కోట్లాది రూపాయల లావాదేవీలు తెలిసిందే. ఏపీలో ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒకప్పుడు చిన్న ఉద్యోగి అయిన ఈయన.. పలు పార్టీల నేతలు, క్రికెటర్లతోసాన్నిహిత్యం పెంచుకుని ఏకంగా బీసీసీఐ లోనే పదవి పొందాలని ప్లాన్ వేశాడట. సనాను జులై 26 న ఈడీ అరెస్టు చేయగా.. ఈ మధ్యే ఢిల్లీలోని సీబీఐ కోర్టు బెయిలు మంజూరు చేసింది. గత రెండేళ్లుగా సనా సతీష్ బాబు కొంతమంది ప్రముఖ ఇండియన్ క్రికెటర్లతోను, ముఖ్యంగా బీజేపీ నేతలతోనూ టచ్ లో ఉంటూ వచ్చాడని తెలిసింది. మొయిన్ ఖురేషీ నిర్వహిస్తున్న ఓ కంపెనీ నుంచి ఈయన 50 లక్షల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్టు వఛ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరిపింది. సనా ఏర్పాటు చేసిన లావిష్ విందులకు అనేకమంది సినీ, క్రికెట్ దిగ్గజాలు, సెలబ్రిటీలు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యేవారని, బీసీసీలో తనకో పోస్టు దక్కేలా చూడాలని వారిని కోరేవాడని తెలియవచ్చింది. అయితే సనా కోర్కె నెరవేరేలోగా ఈడీ చట్రంలో ఇరుక్కున్నాడు.