V. C. Sajjanar: పెరుగుతున్న పెట్రోల్ ధరలపై వీసీ సజ్జనార్ సెటైర్లు.. మహేష్ బాబు ఫొటోతో..

|

Nov 01, 2021 | 9:30 AM

పెట్రోల్.. ఇప్పుడు ఈ మాట వింటేనే జనల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.

V. C. Sajjanar: పెరుగుతున్న పెట్రోల్ ధరలపై వీసీ సజ్జనార్ సెటైర్లు.. మహేష్ బాబు ఫొటోతో..
Sajjanar
Follow us on

V. C. Sajjanar: పెట్రోల్.. ఇప్పుడు ఈ మాట వింటేనే జనల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పెట్రోల్ ధరలపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బైకులు, కార్లు కంటే ఎలక్టికల్ బండ్లు, సైకిళ్లు బెటర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు ప్రజలు. ఇక సోషల్ మీడియాలో పెట్రోల్ ధరల పై రకరకాల ట్రోల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర 114రూపాయలుగా ఉంది. ఇప్పటికే సిటీలో చాలా మంది బైకుల కంటే సిటీ బస్సులు, మెట్రో ట్రైన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

తాజాగా పెరుగుతున్న పెట్రల్ ధర పై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా పెట్రోల్ ధరలపై సెటైర్లు వేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ మీమ్ పోస్ట్ ను షేర్ చేశారు. ఈ పోస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు బైక్ నడుపుతున్న ఫొటోలతో ఉప్పల్, జీడిమెట్ల, ఆరాంఘర్ .. తూ దీనెమ్మ జీవితం ట్యాంకులు, ట్యాంకులు పెట్రోల్ అయిపోతుంది సిటీలో తిరుగుదామంటే.. అందుకే బ్రదర్ లీటర్ పెట్రోల్ కంటే తక్కువ ధరకే టీఎస్ ఆర్టీసీ వారి టీఎస్24 టిక్కెట్ తో 24 గంటలు సిటీ అంత తిరుగు.. అంటూ రాసి ఉన్న ఓ మీమ్ ఫోటోను షేర్ చేశారు సజ్జనార్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rare Hobby: ఈ వ్యక్తి చేసే పనికి మెచ్చుకోకుండా ఉండరు..! విద్యార్ధుల చూడాల్సిన మ్యూజియం..(వీడియో)

Yogi Adityanath: ఎయిర్‌ స్ట్రైక్‌‌కి సిద్ధంగా ఉండండి.. తాలిబన్లకు యూపీ సీఎం వార్నింగ్..

Tragedy: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ దుర్మరణం