TSRTC: ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. బస్టాండ్‌లోనే ఆధార్ అప్‌డేట్

ఆధార్‌ కార్డు ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. అన్ని పనులకు ఆధార్‌ ఆధారంగా మారింది. సిమ్‌ కార్డు నుంచి కారు కొనుగోలు చేయాలన్నా ఆధార్‌ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ఆధార్‌ అప్‌డేట్ చేసుకునేందుకు ఆధార్‌ సెంటర్‌ వెళ్లాల్సిందే. అయితే ఇలాంటి వారి కోసమే...

TSRTC: ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. బస్టాండ్‌లోనే ఆధార్ అప్‌డేట్
Hyderabad

Updated on: Apr 10, 2023 | 3:58 PM

ఆధార్‌ కార్డు ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. అన్ని పనులకు ఆధార్‌ ఆధారంగా మారింది. సిమ్‌ కార్డు నుంచి కారు కొనుగోలు చేయాలన్నా ఆధార్‌ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ఆధార్‌ అప్‌డేట్ చేసుకునేందుకు ఆధార్‌ సెంటర్‌ వెళ్లాల్సిందే. అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వినూత్నంగా బస్టాండులో ఆధార్‌ సెంటర్‌ ఏర్పాటుకు నాంది పలకింది. ప్రయాణికుల కోసం హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ బస్టాండ్‌లో ఆధార్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఆధార్‌ కేంద్రానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసిన సజ్జనర్‌.. ‘ప్రయాణికులు, సంస్థ ఉద్యోగుల కోసం హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ ప్రాంగణంలో ఆధార్‌ సేవా కేంద్రాన్ని యూఐడీఏఐ సహకారంతో టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రం సోమవారం నుంచి వారం రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ కేంద్రంలో కొత్త ఆధార్‌ నమోదుతో పాటు పాత ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. పదేళ్లకోసారి ఆధార్‌ను తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలని ఇటీవల మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ సేవా కేంద్రాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి’ అని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది ఆర్టీసీ ప్రయాణికులతో పాటు ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపనున్నాయి. ఆధార్‌ కార్డును ప్రతీ పదేళ్లకోసారి అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ సేవలు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సేవలు ఎంజీబీఎస్‌కు మాత్రమే పరిమితమవుతాయా.? ఇతర బస్టాండ్‌లోనూ ఏర్పాటు చేస్తారా అన్నది చూడాలి.?

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..