Hyderabad: సైదాబాద్‌ యాసిడ్‌ దాడి కేసులో గురుశిష్యులు అరెస్ట్‌.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

సైదాబాద్‌లో యాసిడ్ దాడి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాసిడ్ దాడి ఎందుకు జరిగింది? కారణాలేంటనే అనే కోణంలో పోలీసులు జరిపిన దర్యాప్తులో దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి.. హైదరాబాద్‌ సైదాబాద్ భూలక్ష్మి టెంపుల్ ఆలయంలో యాసిడ్‌ దాడి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

Hyderabad: సైదాబాద్‌ యాసిడ్‌ దాడి కేసులో గురుశిష్యులు అరెస్ట్‌.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Crime News

Updated on: Mar 16, 2025 | 1:28 PM

సైదాబాద్‌లో యాసిడ్ దాడి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాసిడ్ దాడి ఎందుకు జరిగింది? కారణాలేంటనే అనే కోణంలో పోలీసులు జరిపిన దర్యాప్తులో దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి.. హైదరాబాద్‌ సైదాబాద్ భూలక్ష్మి టెంపుల్ ఆలయంలో యాసిడ్‌ దాడి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ముమ్మరంగా దర్యాప్తు చేపట్టిన సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు .. నిందితుడు హరనాథ్ శర్మని ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు.. హరనాథ్ శర్మ జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో పూజారిగా గుర్తించారు. విచారణలో కీలక విషయాలు వెలుగు చూసినట్లు పోలీసులు తెలిపారు.

అకౌంటెంట్‌ నర్సింగ్‌ రావు తరుచూ వేధిస్తున్నాడని హరనాథ్ శర్మకు చెప్పాడు భూలక్ష్మి టెంపుల్ ప్రధాని పూజారి రాజశేఖర్ శర్మ.. దీంతో హరనాథ్ శర్మలో క్రూరమైన ఆలోచన వచ్చింది.. గురువును వేధిస్తున్నాడనే కారణంతో శిష్యుడు హరనాథ్ శర్మ .. నర్సింగ్ రావును ఇంటికి పరిమితం చేయాలనే కుట్రపన్నాడు.. దీనిలో భాగంగా అతనిపై ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడ్డాడు హరినాథ్‌ శర్మ.. దాడి జరిగిన 24 గంటలోనే కేసుని ఛేదించారు సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. గురుశిష్యులు హరనాథ్ శర్మ, రాజశేఖర్ శర్మ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని మరిన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

హోలీ పండుగ రోజున..

హోలీ పండుగ రోజున హైదరాబాద్‌ సైదాబాద్ భూలక్ష్మి టెంపుల్ ఆలయంలో అకౌంటెంట్ నర్సింగ్ రావుపై యాసిడ్ దాడి జరిగింది. ముసుగుతో వచ్చిన ఓ వ్యక్తి.. హ్యాపీ హోలీ అంటూ యాసిడ్ దాడి చేశాడు.. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాసిడ్ దాడి ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమ్యయారు సైదాబాద్ పోలీసులు, సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. DVR సాయంతో నిందితుడిని అనుసరిస్తూ 1500 సిసి కెమెరాలను పరిశీలించారు. హరనాథ్ శర్మ ఘటనా స్థలం నుంచి బయటికి వచ్చి టూవీలర్‌పై చాదర్‌ఘాట్ మీదుగా షేక్‌పేట వెళ్లినట్లు ఆధారాలు సేకరించారు. టూ వీలర్‌ నెంబర్ ప్లేట్ ఆధారంగా సమాచారం సేకరించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..