YSR Death Anniversary: ‘రైతే రాజైతే’ వ్యవసాయం పండుగే.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ వేదికగా పుస్తకావిష్కరణ..

|

Sep 01, 2023 | 7:55 PM

YSR 14th Death Anniversary: లెజెండరీ లీడర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి శనివారం (సెప్టెంబర్ 2) జరగనుంది. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన మిత్రులు కేవీపీ రామచంద్రరావు, ఎన్. రఘువీరారెడ్డి రూపొందించిన ‘‘రైతే రాజైతే.. వ్యవసాయం పండుగే’’ అనే పుస్తకాన్ని రూపొందించారు.

YSR Death Anniversary: ‘రైతే రాజైతే’ వ్యవసాయం పండుగే.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ వేదికగా పుస్తకావిష్కరణ..
Raithe Rajaite Book Launch
Follow us on

YSR 14th Death Anniversary: లెజెండరీ లీడర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి శనివారం (సెప్టెంబర్ 2) జరగనుంది. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన మిత్రులు కేవీపీ రామచంద్రరావు, ఎన్. రఘువీరారెడ్డి రూపొందించిన ‘‘రైతే రాజైతే.. వ్యవసాయం పండుగే’’ అనే పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం రేపు హైదరాబాద్‌ వేదికగా జరగనుంది. జూబ్లీహిల్స్ దసపల్ల హోటల్‌లో సాయంత్రం 5గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. రైతే రాజైతే వ్యవసాయం పండుగే గంధ్రావిష్కరణను కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ఆవిష్కరించనున్నారు. పుస్తకావిష్కరణ అనంతరం పథమ ప్రతిని జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వీకరిస్తారు. పాత్రకేయులు పాలగుమ్మి సాయినాథ్ కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ మేరకు ఎమెస్కో విజయకుమార్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ.. ఈ పుస్తకావిష్కరణను చేపట్టనున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి కడప పులివెందులో జూలై 8, 1949న జన్మించారు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని నేతగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించారు. కాగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి.. కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి కుబి భుజం.. ఎడమ భుజం మాదిరిగా ఉండేవారు. ఆయన తీసుకునే నిర్ణయాల్లో వారిద్దరూ కీలకంగా వ్యవహరించారు.

Raithe Rajaite book launch in Hyderabad

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో రేపు పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఆయనకు నివాళులర్పించడంతోపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..