విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు.. సందడిగా మారిన డిపోలు

దీక్ష దివస్ సందర్భంగా వచ్చి విధుల్లోకి చేరాలంటూ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ గురువారం శుభవార్తను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఈ ఉదయాన్నే డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు.. షిఫ్ట్‌లవారీగా డ్యూటీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో సందడి నెలకొంది. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు తమ డిమాండ్లను తీర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5న సమ్మెను ప్రారంభించారు. కానీ […]

విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు.. సందడిగా మారిన డిపోలు
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Nov 29, 2019 | 11:21 AM

దీక్ష దివస్ సందర్భంగా వచ్చి విధుల్లోకి చేరాలంటూ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ గురువారం శుభవార్తను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఈ ఉదయాన్నే డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు.. షిఫ్ట్‌లవారీగా డ్యూటీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో సందడి నెలకొంది.

అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు తమ డిమాండ్లను తీర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5న సమ్మెను ప్రారంభించారు. కానీ ఎన్ని రోజులలైనా వారి డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో.. వెనక్కి తగ్గిన కార్మికులు చివరకు సమ్మె విరమించారు. ఇక ఆర్టీసీ సమ్మెపై గురువారం కేబినెట్ మీటింగ్‌లో చర్చించిన కేసీఆర్.. కార్మికులు విధుల్లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఈ సందర్భంగా కార్మికులకు కొన్ని వరాలను కూడా ఇచ్చారు కేసీఆర్. ఉద్యోగాల్లో చేరిన వారికి జీతాల కోసం రూ.100కోట్లు మంజూరు చేస్తామని.. మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అయితే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బ్రతికించుకోవడం కోసం కిలోమీటర్‌కు 20పైసలు చొప్పున ఛార్జీలు పెంచబోతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఏది ఏమైనా ఆర్టీసీ కార్మికులు మళ్లీ విధుల్లోకి చేరడంతో.. ప్రయాణికుల ఇక్కట్లు తీరనున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu