హైదరాబాద్, ఆగస్టు 9: ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు..సెంటిమెంట్ అయితేనేమి, ఇష్టమైన నంబర్ అయితేనేమి, జాతక బలం ప్రకారం అయితేనేమి.. అనుకున్న నంబర్‌ను దక్కించుకునేందుకు వాహనాల యజమానులు ఎంతదాకా అయినా ఖర్చు చేసిన సందర్భాలు చూశాం. ఇందులో సెలబ్రిటీలతో పాటు సంపన్న వర్గాల వారు ఉంటారు. ఈ క్రమంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో..ఒక్కరోజే ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో కాసుల వర్షం కురిసింది. ఫ్యాన్సీ నెంబర్ క్రేజ్ కారణంగా..ఒక్కరోజులో అరకోటిపైనే ఆదాయం వచ్చిపడింది. ఫ్యాన్సీ నెంబర్లకు ఎప్పుడూ క్రేజ్ కొనసాగుతోందరని ఈ వేలం మరోసారి నిరూపించింది. వాహనదారులు అభిరుచిని ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ క్యాష్ చేసుకుంది. దీంతో ఫ్యాన్సీ నెంబర్లు రవాణా శాఖకు కాసుల పంట పండింది. తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నెంబర్ వేలం ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మీరు స్టన్ అవ్వాల్సిందే. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఒక్కరోజే 53లక్షల 34వేల 894 ఆదాయం వచ్చింది. ఈ వేలంలో అత్యధికంగా టీఎస్ 09 జీసీ 9999 ఏకంగా 21లక్షల 60వేల పలికింది. దీనిని ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది.
మార్కెట్‌లోకి వచ్చిన కొత్త మోడల్ బండి తీయడమే కాదు.. దానికి ఫ్యాన్సీ నంబర్ కూడా ఉంటే.. ఆ కిక్కే వేరన్నది కొందరి వెర్షన్. అందుకే ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకునేందుకు లక్షలు పోస్తారు. కొన్ని సార్లు అయితే బండి ధర కంటే.. ఫ్యాన్సీ నంబర్ కోసం పెట్టిన ఖర్చే అధికంగా ఉంటుంది కూడా. ఎవరి ఇంట్రస్ట్ వాళ్లది. ఎవరి వెర్షన్ వాళ్లది. అంతే కదా..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..