Telangana: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సెలవులు ఇవే.. లిస్టు ఇదిగో.!

న్యూఇయర్ వచ్చేసింది. సంక్రాంతి హాలీడేస్ ఆగయా అంటూ అప్పుడే స్కూల్ పిల్లల్లో సంతోషం ప్రారంభమైంది. జనవరి అంటేనే సెలవులు అంటూ సంబరపడిపోతుంటారు స్టూడెంట్స్. న్యూఇయర్ డే, సంక్రాంతి, రిపబ్లిక్ డే అంటూ సెలవులతో..

Telangana: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సెలవులు ఇవే.. లిస్టు ఇదిగో.!
Students

Edited By:

Updated on: Jan 03, 2024 | 1:13 PM

న్యూఇయర్ వచ్చేసింది. సంక్రాంతి హాలీడేస్ ఆగయా అంటూ అప్పుడే స్కూల్ పిల్లల్లో సంతోషం ప్రారంభమైంది. జనవరి అంటేనే సెలవులు అంటూ సంబరపడిపోతుంటారు స్టూడెంట్స్. న్యూఇయర్ డే, సంక్రాంతి, రిపబ్లిక్ డే అంటూ సెలవులతో సరదా.. సరదాగా.. జనవరి మాసం గడిచిపోతుంది. పాఠశాలలకు ఈసారి సంక్రాంతికి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆరు రోజుల సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ అకాడమిక్ ఇయర్‌లో ఇవే చివరి లాంగ్ హాలీడేస్ కూడా కానున్నాయి.

తెలంగాణ విద్యాశాఖ అకడామిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉన్నాయి. అయితే మిషనరీ పాఠశాలలకు మాత్రం ఈ హాలీడేస్ నుంచి మినహాయింపు ఉంది. సంక్రాంతి సెలువులు జనవరి 12న ప్రారంభం అయితే.. మరుసటి రోజే రెండో శనివారం, తర్వాత ఆదివారం వస్తున్నాయి. 14 ఆదివారం భోగి పండుగ కాగా.. 15వ తేదీ సోమవారం సంక్రాంతి పర్వదిన వస్తోంది. 16, 17న ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవులు ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్ రానున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సిలబస్ పేరిట పండుగ హాలీడేస్‌లలో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ చెబుతోంది. కాగా జనవరి 25న ఆదివారం, 26 రిపబ్లిక్ డే వరుస సెలవులు రాబోతున్నాయి. దీంతో పిల్లలు నిజంగా హాలీడేస్ పండగ చేసుకోబోతున్నారు.