Eggs – Chicken Prices: కోడి బలిసింది.. జేబుకి చిల్లు పడింది.. పెరిగిన గుడ్లు, చికెన్ ధరలు.
తెలంగాణలో నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకదాని రేటు కాస్త తగ్గుతుందనుకునే సరికి మరొక వస్తువు ధర పెరిగేందుకు రెడీగా ఉంటోంది. మొన్నటివరకు ఉల్లిధర కన్నీళ్ళు తెప్పిస్తే.. టమాట, పచ్చిమిర్చి ధరలు మిన్నంటాయి. ఇప్పుడు కోడిగుడ్ల వంతు వచ్చింది. రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గత నెల కార్తీకమాసం కావడంతో చికెన్, గుడ్ల లెక్కల్లో కాస్త తగ్గుదల కనిపించినా... కార్తీకమాసం ముగిసిన తర్వాత కోడి గుడ్ల వినియోగం విపరీతంగా పెరగటంతో ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. గత నెలలో ఒక్కో గుడ్డు ధర 5 రూపాయల 50 పైసలు ఉండగా గతవారం 6 రూపాయలకు పెరిగింది.
తెలంగాణలో నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకదాని రేటు కాస్త తగ్గుతుందనుకునే సరికి మరొక వస్తువు ధర పెరిగేందుకు రెడీగా ఉంటోంది. మొన్నటివరకు ఉల్లిధర కన్నీళ్ళు తెప్పిస్తే.. టమాట, పచ్చిమిర్చి ధరలు మిన్నంటాయి. ఇప్పుడు కోడిగుడ్ల వంతు వచ్చింది. రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గత నెల కార్తీకమాసం కావడంతో చికెన్, గుడ్ల లెక్కల్లో కాస్త తగ్గుదల కనిపించినా.. కార్తీకమాసం ముగిసిన తర్వాత కోడి గుడ్ల వినియోగం విపరీతంగా పెరగటంతో ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. గత నెలలో ఒక్కో గుడ్డు ధర 5 రూపాయల 50 పైసలు ఉండగా గతవారం 6 రూపాయలకు పెరిగింది. ఇప్పుడు ఏకంగా 7 నుంచి 8 రూపాయలు పలుకుతోంది. వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర ఏకంగా 72 రూపాయల నుంచి 84 రూపాయలకు చేరుకుంది. రిటైల్ మర్కెట్లో ఒక్కో గుడ్డును 7 నుంచి 8 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం ఒక కేసు గుడ్ల ధర 180 నుంచి 200 రూపాయలు పలుకుతోంది. ఇటు చికెన్ ధర కూడా పెరిగిపోయింది. గత నెలలో కిలో చికెన్ 170 నుంచి 190 వరకు ఉన్న ధర తాజాగా 240 రూపాయలకి ఎగబాకింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ ఈవెంట్స్ రావడంతో ప్రతి ఒక్కరూ బిర్యానీలకు మొగ్గు చూపారు. దీంతో చికెన్ డిమాండ్ పెరిగిపోయింది. ఇదే అదునుగా భావించి వ్యాపారస్తులు ధరలు పెంచేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

