
Raja Singh slams Asaduddin Owaisi : ఇండియాలో తొలి టెర్రరిస్ట్ ఎవరు? గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేనా? రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీనా? ఎంపీ అసదుద్దీన్.. ఎమ్మెల్యే రాజాసింగ్ పరస్పర ఆరోపణలతో కొత్త సంవాదానికి తెరతీసింది. ఇంతకీ టెర్రరిస్ట్ కామెంట్లకు ఆజ్యం పోసిన సందర్భమేంటి? అనేది చూడండి..
ఈ ఒకే ఒక్క ఫోటో వివాదానికి ఆజ్యం పోసింది. శ్రీరామనవమి రోజున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన శోభాయాత్రలో కొంతమంది ఈ ఫోటోను ప్రదర్శించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంట్రవర్శీ కామెంట్లు చేశారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. దేశంలో మొదటి టెర్రరిస్టు గాడ్సేనే అని.. ఆయన ఫోటోలు ప్రదర్శిస్తుంటే హైదరాబాద్ పోలీసులేం చేస్తున్నారని ప్రశ్నించారు. హజరీ, ఒసామా బిన్ లాడెన్ ఫోటోలతో ఎవరైనా డాన్స్‌లు, ర్యాలీలు చేస్తే.. మజ్లిస్ పార్టీపై నోరు పారేసుకునే వారన్నారు ఓవైసీ. ఎంఐఎం కారణంగానే హైదరాబాద్ ఉగ్రవాదుల స్థావరంగా మారిందని… పోలీసులు ఎంఐఎం కార్యకర్తలను అరెస్ట్ చేసేవారన్నారు.
కాగా.. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. తొలి టెర్రరిస్ట్ నాథూరామ్ గాడ్సే కాదని.. తెలంగాణలో దమనకాండ సాగించిన ఖాసీం రజ్వీ అన్నారు. శోభాయాత్రలో శివాజీ, వీర సావర్కర్‌ల ఫోటోలు ఓవైసీకి కనబడలేదా అని ప్రశ్నించారు రాజాసింగ్. ఫోటోతో మొదలైన లొల్లి రజ్వీని సీన్‌లోకి లాగింది. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పడుతుందా? మరోవైపు టర్న్ తీసుకుని రచ్చ చేస్తుందా అన్న చర్చ హీట్ పుట్టిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..