Hyderabad Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం, పవర్ కట్.

నిన్నటి వరకు విపరీతమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాదీలకు ఉపశమనం లభించింది. నగర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువే ఉన్నా సాయంత్రానికి పూర్తిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చందానగర్‌, పటాన్‌చెరు, మియాపూర్‌తో పాటు మాదాపూర్‌..

Hyderabad Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం, పవర్ కట్.
Rain In Hyderabad

Updated on: Jun 04, 2023 | 6:36 PM

నిన్నటి వరకు విపరీతమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాదీలకు ఉపశమనం లభించింది. నగర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువే ఉన్నా సాయంత్రానికి పూర్తిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చందానగర్‌, పటాన్‌చెరు, మియాపూర్‌తో పాటు మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గంలో వర్షం కురుస్తోంది. హైటెక్‌సిటీ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. వీటితోపాటు అమీర్‌పేట్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌లోనూ వర్షం కురుస్తోంది.

వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. పటాన్‌ చెర్, ఆర్‌సీపురం ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఇక హైదరాబాద్‌ నగరంతో పాటు పక్కనే ఉన్న మెదక్‌ జిల్లాలోనూ వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సంగారెడ్డి, కంది, నారాయణఖేడ్‌లో వర్షం కురుస్తోంది. రేగోడ్‌, శివ్వంపేట మండలాల్లో వర్షం పడుతోంది. అంతేకాకుండా సిద్దిపేట, వర్గల్‌, జగదేవ్‌పూర్‌, ములుగులోనూ వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..