Railway Passenger Alert: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతికి మరిన్ని సమ్మర్ స్పెషల్ రైళ్లు..

Summer Special Trains: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ తెలిపింది. వేసవి సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రైల్వే శాఖ తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

Railway Passenger Alert: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతికి మరిన్ని సమ్మర్ స్పెషల్ రైళ్లు..
Indian Railways
Follow us
Janardhan Veluru

|

Updated on: May 30, 2022 | 7:14 PM

Railway News: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ తెలిపింది. వేసవి సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రైల్వే శాఖ తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా మరో 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ – తిరుపతి , తిరుపతి – హైదరాబాద్, తిరుపతి – కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ – తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. మే 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రత్యేక రైలు (నెం.07433) హైదరాబాద్ నుంచి సాయంత్రం 06.40 గం.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.50 గం.లకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే జూన్ 1, 8, 15, 22, 29 తేదీల్లో ప్రత్యేక రైలు (నెం.07434) తిరుపతి నుంచి రాత్రి 08.25 గం.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు హైదరాబాద్ చేరుకుంటుంది.

అలాగే ప్రత్యేక రైలు (నెం.07435) జూన్ 2,9,16,23,30 తేదీల్లో తిరుపతి నుంచి సాయంత్రం 04.15 గం.లకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 04.00 గం.లకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. మరో ప్రత్యేక రైలు (నెం.07436) జూన్ 2,9,16,23,30 తేదీల్లో కాకినాడ టౌన్ నుంచి ఉదయం 07.30 గం.లకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 06.40 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది.

తిరుపతి-హైదరాబాద్ మధ్య మొత్తం 10 ప్రత్యేక సర్వీసులు నడపనుండగా.. ఇవి సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. తిరుపతి – కాకినాడ టౌన్ మధ్య 10 ప్రత్యేక సర్వీసులు నడపనుండగా.. ఇవి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి

కాచిగూడ-తిరుపతి-కాచిగూడ సమ్మర్ స్పెషల్..

అలాగే కాచిగూడ-తిరుపతి మధ్య రెండు సమ్మర స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఇది వరకే ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక రైలు (నెం.07297) జూన్ 1 తేదీన (బుధవారం) రాత్రి 10.20 గం.లకు కాచిగూడ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 11 గం.లకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే మరో ప్రత్యేక రైలు (నెం.07298) జూన్ 2న (గురువారం) మధ్యాహ్నం 03 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 04 గం.లకు కాచిగూడకు చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ ఉందానగర్, షాద్‌నగర్, జడ్జెర్చ, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపర్తి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల