Hyderabad: పుడింగ్ పబ్ కేసులో నిందితుడు అభిషేక్‌కు బెయిల్ మంజూరు.. A1గా ఉన్న అనిల్‌కు నిరాకరణ
పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ కు నాంపల్లి కోర్టు ఊరటనిచ్చింది. అభిషేక్ ఉప్పాలకు బెయిల్ నాంపల్లి కోర్టు అభిషేక్‌కు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
Hyderabad: పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో(Pudding and Mink Pub Case) నిందితుడిగా ఉన్న అభిషేక్‌కు నాంపల్లి కోర్టు(Nampally Court) బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అభిషేక్ బయటికి వచ్చారు. ప్రతి రెండు ఆదివారాలకు ఒకసారి బంజారాహిల్స్ పోలీసుల ఎదుట అభిషేక్ హాజరవ్వాలని కోర్టు షరతు విధించింది. ఇదే కేసులో A1గా ఉన్న పబ్ మేనేజర్ అనిల్‌కు కోర్టు బెయిల్ నిరాకరించింది.
గత నెల 3వ తేదీన తెల్లవారుజూమున టాస్క్‌ఫోర్స్ పోలీసులు పుడింగ్ పబ్‌పై దాడి చేశారు. పబ్‌లో 4.6 గ్రాముల కొకైన్ లభించడంతో పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి పబ్ యజమాని అభిషేక్‌తో పాటు, మేనేజర్ అనిల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరినీ ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు మరికొంత మందిని విచారించారు. విచారణ పూర్తి అయినందున బెయిల్ ఇవ్వాలని నిందితులు నాంపల్లి కోర్టులో గత నెల 21న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నిందితులు.. బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. అభిషేక్‌కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.. అనిల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..