AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SR నగర్‌లో టెన్షన్‌.. టెన్షన్.. కళ్లముందే తగలబడ్డ ట్రావెల్స్ బస్సు! పరుగులు తీసిన జనాలు

హైదరాబాద్‌ నగరంలోని ఎస్ఆర్ నగర్‌లో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఉమేష్ చంద్ర స్టాచ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడుతున్న దృశ్యాలు సంచలనంగా మారాయి. బస్సులో మంటలు చెలరేగటంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంజన్లో మంటలను గుర్తించి బస్సును పక్కకు ఆసిన డ్రైవర్. బస్సులో ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలు అదుపులోకి తెచ్చారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతున్న శ్రీ సాయి బాలాజీ ట్రావెల్స్ బస్సులో ఈ సంఘటన చోటు చేసుకుంది..

SR నగర్‌లో టెన్షన్‌.. టెన్షన్.. కళ్లముందే తగలబడ్డ ట్రావెల్స్ బస్సు! పరుగులు తీసిన జనాలు
SR Nagar Private Travels Bus fire accident
Srilakshmi C
|

Updated on: Sep 26, 2025 | 7:59 AM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26: హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ఎస్సార్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచు దగ్గరికి చేరుకోగానే బస్ ఆగిపోయింది. ఇంజన్ స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించడంతో బస్సులో నుంచి పోగలు ప్రారంభమై మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికుల్ని వెంటనే దించివేయడంతో ప్రమాదం తప్పింది. సెల్ఫ్ మోటర్ కి బ్యాటరీ కి కనెక్ట్ చేసిన వైర్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణికులకు సేఫ్ గా ఉన్న వారి లగేజ్, లాప్టాప్ లు సెల్ ఫోన్లు అన్ని అగ్నికి దగ్ధమయ్యాయి.

ఎస్సార్ నగర్ సిగ్నల్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకున్న శ్రీ సాయి బాలాజీ ట్రావెల్స్ బస్సు బయల్దేరేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో సెల్ఫ్ మోటర్ బ్యాటరీస్ కనెక్షన్స్ లో ఎత్తడంతో టైం కింది భాగంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సులో ప్రయాణికులను దింపేశారు. మియాపూర్ లో బస్సు ప్రారంభం కావటానికి ముందు గంటన్నర పాటు ఇంజన్ ఆన్ చేసి అన్ని చెక్ చేసామని ఫైర్ యాక్సిడెంట్ అయిన ట్రావెల్స్ బస్ ఓనర్ రాము తెలిపారు. అప్పుడు అంతా సవ్యంగానే ఉంది. దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు కాబట్టి ఏసీ తో సహా అన్ని చెక్ చేసుకున్నాకే బండి రోడ్డు మీదకు వస్తుంది. బస్సు ఎస్సార్ నగర్ కి రాగానే డ్రైవర్ ఫోన్ చేసి బస్సు స్టార్ట్ అవ్వట్లేదని చెప్పాడు. ఏం జరిగిందని ఫోన్లో మాట్లాడుతుండగానే బస్సులోంచి పొగలు వస్తున్నాయని డ్రైవర్ చెప్పాడు. వెంటనే ప్రయాణికులను దింపమని చెప్పాను. బస్ కి అన్ని ఫిట్నెస్ పారామీటర్ ప్రాపర్ గా ఉన్నాయి. నెల రోజుల క్రితమే బస్సుకి ఫిట్నెస్ టెస్ట్ రాజమండ్రిలో చేయించానని బస్సు ఓనర్‌ చెప్పాడు.

రాజమండ్రికి వెళుతున్న శ్రీ సాయి బాలాజీ ట్రావెల్స్ ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైందని సమాచారం అందిందని వెస్ట్ జోన్ DCP విజయ్ కుమార్ వెల్లడించారు. లా అండ్ ఆర్డర్, ఫైర్ డిపార్ట్మెంట్ పోలీసుల వెంటనే స్పాట్ కి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ స్పాట్ కి చేరుకొని మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న అందరూ సేఫ్ గా ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని నిర్ధారించాం. ఫైర్ యాక్సిడెంట్ కి బస్ ఫిట్నెస్ లోపం కారణమని తేలితే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.