AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP, Telangana News Live: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. జీవో విడుదల

బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది..

AP, Telangana News Live: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. జీవో విడుదల
AP, Telangana News Live Updates
Srilakshmi C
|

Updated on: Sep 27, 2025 | 5:40 AM

Share

ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈరోజు, రేపు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురువనున్నాయి. ఇక అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం, విశాఖలోని తుపాను హెచ్చరికలు జారీ చేశాయి. తీరం వెంట గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప జనాలను బయటకు రావొద్దంటూ సూచించింది. అల్పపీడనం ప్రభావంతో  సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తా కథనాల కోసం ఇక్కడ వీక్షించండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Sep 2025 07:49 PM (IST)

    తెలంగాణ స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ

    తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌తో పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఎమ్మె్ల్యేలు కడియం శ్రీహరి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్‌గౌడ్ హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మరోవైపు స్పీకర్ నోటీసులకు ఇప్పటికే కాలే యాదయ్య, అరికపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వివరణ ఇచ్చారు. ఈ నెల 30 వరకు గడువు కావాలని కడియం శ్రీహరి కోరారు. ఇదిలావుంటే, అక్టోబర్ 6 నుండి 23 వరకు విదేశీ పర్యటనకు స్పీకర్ గడ్డం ప్రసాద్ వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 29 నుండి స్పీకర్ ప్రత్యక్ష విచారణ చేపట్టే అవకాశం ఉంది. విదేశీ పర్యటనకు ముందే పిరాయింపు ఎమ్మెల్యేల విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది.

  • 26 Sep 2025 07:37 PM (IST)

    స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం!

    — స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం

    — రేపు శనివారం (సెప్టెంబర్ 27) ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం

    — ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ సమావేశం

    — రేపు సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం!

  • 26 Sep 2025 07:33 PM (IST)

    ఏపీ మున్సిపల్ శాఖ కీలక ఒప్పందం

    — స్కూల్ ఆఫ్‌ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌తో మున్సిపల్ శాఖ ఒప్పందం

    — మంత్రి నారాయణ సమక్షంలో సంతకాలు

    — అమరావతి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టేలా నిర్ణయం

    — సరికొత్త సాంకేతికను ఉపయోగించేలా ప్రణాళికలు

  • 26 Sep 2025 07:33 PM (IST)

    అంబర్‌పేట-మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత

    రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదలుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట-మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. దిల్‌సుఖ్‌నగర్‌ వైపు నుంచి వచ్చిపోయే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జి మీదుగా దారి మళ్లించారు.

  • 26 Sep 2025 05:24 PM (IST)

    పశువుల‌ కాపారుల మృతి వీడిన‌ మిస్టరీ..!

    పశువుల‌ కాపారుల మృతి కేసులో మిస్టరీని ఛేదించారు అధికారులు. ఎలుగ బంటి దాడిగా తేల్చారు అటవీ శాఖ అధికారులు. కొమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం భీమన్న అభయారణ్యంలో ఇద్దరు పశువుల కాపారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అచ్చెల్లి గ్రామానికి చెందిన దూలం శేఖర్, దూలం సుశీల భార్యాభర్తలుగా గుర్తించారు. అటవీ ప్రాంతంలో పశువులు కాసేందుకు వెళ్లి మృత్యువాతపడ్డారు. ఎలుగుబంటి దాడిలో మృతి చెందినట్టు అటవీ శాఖ అధికారుల నిర్ధారించారు. దీంతో ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది అటవీ శాఖ.

  • 26 Sep 2025 04:33 PM (IST)

    రాగల రెండు, మూడు గంటలు కుండపోత

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. ఇది కాస్తా మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. రేపు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. కోస్తా జిల్లాల్లో మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

    తెలంగాణలో రాగల రెండు, మూడు గంటలలో ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీమ్ ఆసిపాబాద్, మంచిర్యాలు, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వనసర్తి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం..

  • 26 Sep 2025 03:47 PM (IST)

    OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్!

    తెలంగాణలో పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్ తగిలింది. రివ్యూ తర్వాత కూడా పెంపునకు హైకోర్టు ఓకే చెప్పలేదు. సెప్టెంబర్ 24వ తేదీ ఇచ్చిన ఉత్తర్వులే పొడిగిస్తూ మళ్లీ జడ్జిమెంట్‌ ఇచ్చారు న్యాయమూర్తి. అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. తదుపరి విచారణ అక్టోబర్ 9 కు వాయిదా వేసినట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించింది.

  • 26 Sep 2025 03:21 PM (IST)

    అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు

    రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తోపాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ఆ దిశగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని సీఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

  • 26 Sep 2025 01:26 PM (IST)

    వచ్చే 2, 3 గంటల్లో భారీ వర్షం.. వాతావరణ కేంద్రం హెచ్చరిక

    రాగల రెండు మూడు గంటలలో తెలంగాణ లోని పెద్దపల్లి లో భారీ వర్షం కురిసే అవకాశం కురవనుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాలు, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు సూచించింది.

  • 26 Sep 2025 01:23 PM (IST)

    నవమిలోపు తేల్చకపోతే సజీవ సమాధి.. మాజీ DSP నళిని సంచలన ప్రకటన

    సీఎంకు నా ఫైల్ డిస్పోస్ చేయడం ఇష్టం లేనట్లుంది. నవమి నాటికి నా విషయం ఎటూ తేలకపోతే నేను సజీవ సమాధి అవుతాను. నేను ఏ రకంగా చచ్చినా అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. దీనికి నా ఫేస్‌బుక్ పోస్టులే సాక్ష్యమని మాజీ డీఎస్పీ నళిని ఫేస్‌ బుక్‌లో మారో సంచలన లేఖ వెలువరించారు. సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవట్లేదని, రాష్ట్రపతి మెడల్ లక్ష్యంగా డైనమిక్ ఆఫీసర్‌గా పనిచేసిన తనను సస్పెండ్ చేయడం, వెంటాడి వేటాడటం.. మొత్తం అన్ని సమస్యలకు మూల కారణం కాంగ్రెస్ అని ఆరోపించారు. 21 నెలల క్రితం నళిని ఇచ్చిన రిపోర్ట్‌పై సీఎం రేవంత్‌ ఇంకా చర్య తీసుకోకుండా నిర్లిప్తంగా ఉండడం తక్షణ కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.

  • 26 Sep 2025 01:17 PM (IST)

    జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు మాస్ వార్నింగ్.. రేపట్నుంచి దసరా సెలవులు

    రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు దసరా సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. సెలవుల అనంతరం తిరిగి అక్టోబర్ 6న ఇంటర్ కాలేజీలు తెరుచుకొనున్నాయి. సెలవుల్లో ప్రైవేటు కాలేజీలు క్లాసులు నడిపితే తీవ్ర చర్యలు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది.

  • 26 Sep 2025 12:43 PM (IST)

    జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి

    జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో, త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత కే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్ధిగా ఎంపిక చేశారు.

    తద్వారా.. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా, వారి నిబద్ధతను పరిశీలించిన మీదట, మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు గౌరవాన్నిస్తూ, జూబ్లీ హిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • 26 Sep 2025 12:04 PM (IST)

    అన్నవరంలో భారీ అగ్ని ప్రమాదం

    కాకినాడ జిల్లా అన్నవరం కొండపై పడమర రాజ గోపురం ఎదురుగా గల దుకాణల్లో చెలరేగిన మంటలు. తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సెర్క్యూట్ కారణంగా ఫాన్సీ షాప్ గౌడౌన్లో చెలరేగిన మంటలు. వరుసగా ఉన్న ఏటిఎం, టీ టైం, జ్యూస్ పాయింట్.. చెప్పులు స్టాండ్ షాపులోకి వ్యాపించిన మంటలు. ఫాన్సీ షాప్ గౌడౌన్లో సుమారు రూ.25 లక్షల విలువైన సరుకు బూడిద పాలైంది. హుటా హుటిన రంగంలో దిగి మంటలు అదుపు చేసిన తుని ఫైర్ స్టేషన్ సిబ్బంది.

  • 26 Sep 2025 11:57 AM (IST)

    జలమండలి ఆధ్వర్యంలో STPల శంకుస్థాపనలు వాయిదా! కొత్త తేదీ ఇదే

    హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన అంబర్పేట బతుకమ్మ కుంట వాయిదా పడింది. అలాగే జలమండలి ఆధ్వర్యంలో ఆరు ఎస్టీపీలు, 39 కొత్త ఎస్టీపీలకు CM ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరగాల్సి ఉండగా.. అది ఈ నెల 28కి వాయిదా పడింది.

  • 26 Sep 2025 11:54 AM (IST)

    బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా..! కారణం ఇదే

    హైదరాబాద్ నగరంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నేడు జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 28వ తేదీన ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొననున్న మహిళలు, ప్రజలు వర్షం వల్ల ఇబ్బందులు పడకూడదని నేటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిందని తెలిపారు. ఈనెల 28వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేస్తారని కమిషనర్ పేర్కొన్నారు.

  • 26 Sep 2025 11:52 AM (IST)

    రాష్ట్రంలో భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు

    రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎస్, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న సీఎం. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించిన సీఎం. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన సీఎం.

    హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ఆ దిశగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని సీఎస్ ను ఆదేశించిన సీఎం.

  • 26 Sep 2025 11:49 AM (IST)

    హౌరా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో ఉగ్రవాదులు..?

    ఘట్‌కేసర్‌లో హౌరా ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత. ట్రైన్ లో తనిఖీలు చేస్తున్న అధికారులు. ఉగ్రవాదులు ఉన్నారని ఫోన్ కాల్ రావడంతో తనిఖీలు. హౌరా నుంచి సికింద్రాబాద్ కి వెళ్ళే ఫలక్‌ నామ ట్రైన్ లో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఫోన్ కాల్. కొనసాగుతున్న తనిఖీలు.

  • 26 Sep 2025 11:45 AM (IST)

    కడప జిల్లాలో క్షుద్ర పూజల కలకలం.. జనాల్లో భయం భయం

    కడప జిల్లా రామరాజుపల్లి వద్ద క్షుద్ర పూజల కలకలం. రెండు చోట్ల ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి పూజలు. భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు.గత రెండు నెలలుగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటున్న స్దానికుల ఆవేదన.

  • 26 Sep 2025 11:43 AM (IST)

    శంషాబాద్ వద్ద ట్యాంకర్‌ని ఢీకొన్న బస్సు.. 5 కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్!

    శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం. ప్రైవేట్ బస్సు కెమికల్ ట్యాంకర్ ఢీ పలువురికి సల్ప గాయాలు. తప్పిన పెను ప్రమాదం. భారీగా ట్రాఫిక్ జామ్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగుడా వద్ద కెమికల్ ట్యాంకర్‌ను ఢీకొన్న స్కానియా ప్రైవేట్ బస్సు. ప్రమాదంలో పలువురికి సల్పగాయాలు‌. దీంతో బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఐదు కిలోమీటర్ల మెర ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బంది పడుతున్న వాహనదారులు కనిపించని ట్రాఫిక్ పోలీసులు.

  • 26 Sep 2025 11:40 AM (IST)

    సెక్రటేరియట్ సమీపంలో భారీగా స్తంభించిన వరద నీరు

    హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో Hyderabad సెక్రటేరియట్ సమీపంలో వరద నీరు స్తంభించి పోయి జనం ఇబ్బందులు పడుతున్నారు.

  • 26 Sep 2025 11:38 AM (IST)

    మరికొన్ని గంటలపాటు వర్షం కొనసాగింపు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు

    రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది.వర్షపు నీటితో రహదారులు నీటమునిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్కువ ఎత్తులో ఉన్న కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణ మరియు నీరు దిగువకు తరలించే చర్యలు చేపడుతున్నారు. వర్షం మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

  • 26 Sep 2025 11:37 AM (IST)

    జలదిగ్బంధంలో కోఠి ENT హాస్పిటల్

    కోఠి ENT హాస్పిటల్ వార్డుల్లోకి, ఎమర్జెన్సీ సెంటర్ లోకి వర్షపు నీరు చేరింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు, వైద్యులు. గత నెల రోజుల నుంచి నాలా పైకప్పు కుంగి ఆసుపత్రిలోకి వరదనీరు వస్తున్నా పట్టించుకోని అధికారులు. రాత్రి కురిసిన భారీ వర్షానికి నాలా కుంగడంతో ఆసుపత్రిలోపలికి భారీగా వర్షపు నీరు చేరింది

  • 26 Sep 2025 11:35 AM (IST)

    భారీ వర్షాలు.. బాసరలో గోదారి ఉగ్రరూపం

    నిర్మల్ జిల్లా బాసర ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అమ్మవారి ఆలయం నుండి గోదావరి వెళ్లే రహదారిపై ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తో నీళ్లు నిలిచిపోయాయి. గోదావరి అమ్మవారి టెంపుల్ కు వెళ్లే దారిలో నీళ్లు నిలవడంతో భక్తులకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. భక్తులు రాక గోదావరి ఘాట్లు వేలవేల బోతున్నాయి. వచ్చిన కొద్ది భక్తులకు గోదావరిలోకి వెళ్లకుండా బోట్లను అడ్డుపెట్టి పోలీస్ బందోబస్తు మధ్య భక్తులకు స్నానాలను ఆచరింప చేస్తున్నారు. నవరాత్రులు ప్రారంభమై ఐదవ రోజు కావడంతో భక్తులు రాక గోదావరిపై వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు లబోదిబోమంటున్నార. టెంపుల్ తరపు నుండి ఉచిత బస్సులు రైల్వే స్టేషన్ మీదగా గోదావరి కి నడపాలని భక్తులు, వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు.

  • 26 Sep 2025 11:11 AM (IST)

    భారీ వర్షం ఎఫెక్ట్.. హైదరాబాద్‌ ఉద్యోగులకు Work From Home ఇవ్వాలని ట్రాఫిక్‌ పోలీసుల రిక్వెస్ట్!

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం (సెప్టెంబర్‌ 25) అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. వానల దాటికి శుక్రవారం తెల్లవారుజాము నుంచి రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. దీంతో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు విభాగం అప్రమత్తమైంది. ట్రాఫిక్‌ సమస్యలు, ప్రజా భద్రతా దృష్ట్యా నగరంలోని వివిధ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టింది.

  • 26 Sep 2025 10:16 AM (IST)

    ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష

    ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు నికొలస్‌ సర్కో జీ(70)కి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. లిబియా నేత దివంగత కల్నల్‌ గడాఫీ నుంచి అక్రమంగా లక్షల యూరోలను పొందేందుకు కుట్ర పన్నినట్లు తేలడంతో పారిస్‌ క్రిమినల్‌ కోర్టు గురువారం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

  • 26 Sep 2025 09:46 AM (IST)

    శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలలు.. పెరిగిన భక్తుల రద్దీ

    తిరుమల తిరుపతిలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.16 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,388 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ 1.74 కోట్లు.

  • 26 Sep 2025 09:44 AM (IST)

    టాలీవుడ్‌ డైరెక్టర్‌ YVS చౌదరి ఇంట తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే?

    ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు వైవీఎస్‌ చౌదరికి మాతృ వియోగం. వైవీఎస్‌ చౌదరి తల్లి రత్నకుమారి (88) గురువారం సాయంత్రం కన్నుమూశారు. తల్లితో తనకున్న జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న వైవీఎస్‌ చౌదరి నోట్‌ విడుదల.

  • 26 Sep 2025 09:09 AM (IST)

    కేటుగాళ్ల ఘరానా మోసం.. రైతుల పాన్‌, ఆధార్‌ కార్డులతో రూ.170 కోట్ల స్కాం!

    తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రిప్టో ఫ్రాడ్ కలకలం రేపింది. క్రిప్టో ట్రేడింగ్ లో తెలుగు రాష్ట్రాల రైతులు. 170 కోట్ల స్కాం గుర్తించిన ఐటీ. రైతుల పేర్లు, వారి పాన్ కార్డ్ ఉపయోగించి క్రిప్టోలో ట్రేడింగ్. వివరాల ఆధారంగా గ్రామాలకు వెళ్లిన ఐటీ అధికారులు . విజయవాడ, జగిత్యాల్, సత్తుపల్లి, సిద్దిపేట, ఖమ్మం జిల్లాలకు వెళ్ళి వివరణ తీసుకున్న ఐటీ అధికారులు. ఎక్కువ మంది రైతులు ఉండటంతో షాక్ అయ్యిన అధికారులు. తమకు వీటి పై ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న రైతులు. వీరి పాన్, ఆధార్ లను అగంతకులు వాడుతున్నట్టు గుర్తించిన ఐటీ అధికారులు.

  • 26 Sep 2025 08:29 AM (IST)

    మరింత పతనమైన టమాట ధరలు.. కిలో ఎంతంటే?

    కర్నూలులో మరింత పతనమైన టమోటా ధరలు. పత్తికొండ, ప్యాపిలి మార్కెట్లో కిలో టమోటా కేవలం రెండు రూపాయలే. లబోదిబోమంటున్న రైతులు. కిలో 8 రూపాయలకు కొనుగోలు చేయాలని ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని వ్యాపారులు, అధికారులు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు. ఇటు హైదరాబాద్‌లో మాత్రం కిలో టమాట రూ.30కిపైగా పలకడం గమనార్హం.

  • 26 Sep 2025 08:27 AM (IST)

    ప్రీతి హత్య కేసు సీబీఐకి బదిలీ.. సర్కార్ కీలక నిర్ణయం

    రాష్ట్రంలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి హత్య కేసును సీబీఐకి అప్పగించిన ఏపీ సర్కార్. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసిన హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ . 2017 ఆగస్టు 18వ తేదీన హత్యకు గురైన సుగాలి ప్రీతి. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో సుగాలి ప్రీతి హత్య కేసు నమోదు. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ కొంత కాలంగా ఆందోళన చేపట్టిన సుగాలి ప్రీతి తల్లి. తాజాగా ప్రీతి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్.

  • 26 Sep 2025 08:26 AM (IST)

    నెలాఖరుతో ముగియనున్న స్థానిక ఎన్నికల గడువు.. ఏ క్షణమైనా జీవో విడుదల

    తెలంగాణ ప్రభుత్వానికి చేరిన స్థానిక రిజర్వేషన్ల జిల్లాల వారి నివేదికలు. ఏక్షణమైన ప్రత్యేక జీవో విడుదలయ్యే అవకాశం. డెడికేషన్ కమీషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించనున్న ప్రభుత్వం. 42శాతం బిసి రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. 50శాతం రిజర్వేషన్ సీలింగ్ కు ప్రత్యామ్నాయం గా జీవో. బీసీ 42, ఎస్సీ , ఎస్టీలకు 27 శాతం , రిజర్వేషన్ అమలు చేస్తు జీవో. మొత్తం 69 శాతంకు చేరనున్న తెలంగాణలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు. కరుణానిధి స్ఫూర్తితో అమలు చేస్తామని నిన్న తమిళనాడు లో సీఎం ప్రకటన. దసరా లోపే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం. ఈనెలాఖరుతో స్థానిక ఎన్నికల నిర్వాహణకు ముగియనున్న హైకోర్టు గడువు.

  • 26 Sep 2025 08:23 AM (IST)

    2 రోజులు కుండపోత వానలు.. సీఎం కీలక ఆదేశాలు జారీ

    భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాల అవకాశం. నిరంతరం పరిస్థితిని మానిటర్ చేయాలని సీఎం ఆదేశాలు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్‌లో ఉండాలని ఆదేశం. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే తరలించాలని సూచన. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అన్ని కాజ్ వేలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశం. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేయాలని ఆదేశం.

    విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశం. అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా కొనసాగించాలని సూచన. వేలాడే విద్యుత్ వైర్లు తొలగించాలని సీఎం ఆదేశం. ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచన. దసరా సెలవులున్నా విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచన. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే బయటికి రావాలని సూచన. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

  • 26 Sep 2025 08:19 AM (IST)

    లిక్కర్ స్కాం కేసులో నేటితో ముగిసిన రిమాండ్

    ఏపీ లిక్కర్ స్కాం కేసులో నేటితో ముగియనున్న నిందితుల రిమాండ్. రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఏడుగురు నిందితులను కోర్టు లో నేడు హాజరు‌ పరచనున్న సిట్ అధికారులు.

  • 26 Sep 2025 08:16 AM (IST)

    పాపం.. UNOలో ట్రంప్‌ అంకుల్‌కి ఘోర అవమానం..! వరుసగా 3 సార్లు..

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఈసారి ఐక్యరాజ్య సమితిపై కోపం వచ్చింది. తనకు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఘోర అవమానం జరిగిందని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని UNO ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. UNO కార్యాలయంలో వరుసగా 3 సార్లు అవమానం జరిగినట్లు అందులో వెల్లడించారు. మొదట ఎస్కలేటర్‌పై కాలు పెట్టగానే అది ఆగిపోయింది. భార్య మెలనియాతో మెట్లు ఎక్కి వెళ్లామన్నారు. ఆ తర్వాత 15 నిమిషాల పాటు టెలిప్రాంప్టర్‌ ఆగిపోయింది. ఇక మూడోది ఆడిటోరియంలోని సౌండ్‌ సిస్టమ్‌. తన ప్రసంగం సమయంలో తన భార్య మెలనియాకు ఒక్క ముక్క కూడా వినిలేదట. ఇవి యాదృచ్ఛికం కాదు. ఖచ్చితంగా నాకు జరిగిన అవమానమే అని తన పోస్టులో వెల్లడించారు.

  • 26 Sep 2025 08:06 AM (IST)

    మరో బాంబ్‌ పేల్చిన డొనాల్డ్ ట్రంప్‌.. ఈసారి సుంకాలపై ఏకంగా 100 శాతం పెంపు

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై ఫోకస్‌ పెట్టారు. బ్రాండెడ్‌, పేటెంటెడ్‌ ఔషధాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటన వెలువరించారు. అలాగే అప్‌హోస్టర్డ్ ఫర్నిచర్‌పై 30%, భారీ ట్రక్కులపై 25% దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. పెరిగిన సుంకాలు అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి వస్తాయని ట్రాప్‌ స్పష్టం చేశారు. అయితే అమెరికాలో ప్లాంట్‌లను నిర్మిస్తున్న విదేశీ ఫార్మా కంపెనీలకు ఈ సుంకాలు వర్తించవని చెప్పడం గమనార్హం.

  • 26 Sep 2025 06:52 AM (IST)

    తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యక్షమైన గోల్డ్‌ మ్యాన్‌.. ఎగబడ్డ జనాలు!

    తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఒంటి నిండా బంగారంతో వచ్చిన ఓ వ్యక్తి స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారాడు. హైదరాబాదుకు చెందిన హోప్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌ ఏకంగా 6 కిలోల బంగారు ఆభరాణాలు ధరించి తిరుమల కొండపై ప్రత్యక్షమయ్యాడు. దీంతో భక్తులు అతడిని చూసేందుకు ఎగబడ్డారు.

  • 26 Sep 2025 06:50 AM (IST)

    SR నగర్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం.. కళ్లముందే కాలిబూడిదైన వైనం

    హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ఎస్సార్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచు దగ్గరికి చేరుకోగానే బస్ ఆగిపోయింది. ఇంజన్ స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించడంతో బస్సులో నుంచి పొగలు ప్రారంభమై మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికుల్ని వెంటనే దించివేయడంతో ప్రమాదం తప్పింది. సెల్ఫ్ మోటర్ కి బ్యాటరీ కి కనెక్ట్ చేసిన వైర్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణికులకు సేఫ్ గా ఉన్న వారి లగేజ్, లాప్టాప్ లు సెల్ ఫోన్లు అన్ని అగ్నికి దగ్ధమయ్యాయి.

  • 26 Sep 2025 06:48 AM (IST)

    వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో 5వ రోజు.. పోటెత్తిన భక్తులు

    వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాలు. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ లలితా మహా త్రిపుర సుందరీ అలంకారములో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం పల్లకీసేవ, సాయంత్రం శేషవాహనసేవ. అమ్మవారి దర్శనం కోసం పోటెత్తుతున్న భక్తులు.

  • 26 Sep 2025 06:45 AM (IST)

    ఇంద్రకీలాద్రిపై ఐదో రోజు శరన్నవరాత్రులు.. నేడు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో దుర్గమ్మ

    విజయవాడ శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై ఐదో రోజుకు ఉత్సవాలు చేరుకున్నాయి. నేడు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన దర్శనాలు. నిన్న దుర్గమ్మను దర్శించుకున్న లక్ష మందికి పైగా భక్తులు. పెరిగిన వీఐపీల తాకిడి.

  • 26 Sep 2025 06:42 AM (IST)

    శ్రీశైలం దసరా మహోత్సవాల్లో 5వ రోజు.. నేడు అమ్మవారి గ్రామోత్సవం

    నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఐదో రోజు దసరా మహోత్సవాలు నేడు జరగనున్నాయి. సాయంత్రం స్కందమత అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం. శేషవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకొనున్న ఆది దంపతులు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం జరనుంది.

  • 26 Sep 2025 06:40 AM (IST)

    ఇక ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్.. సీఎం చంద్రబాబు

    ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాబు ష్యూరిటీ… జాబు గ్యారెంటీ.. నినాదాన్ని నిజం చేస్తున్నామని, అత్యంత పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ చేపట్టామన్నారు. విద్యార్థులకు టీచర్లు నైతిక విలువలు బోధించాలి. ఉపాధ్యాయులూ నిత్యం అప్డేట్ అవుతూ ఉండాలని మెగా డీఎస్సీ విజేతల సభలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మెగా డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించిన మంత్రి లోకేష్ బృందానికి ఈ సందర్భంగా సీఎం అభినందనలు తెలిపారు. కొత్త టీచర్లకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి అందచేశారు.

Published On - Sep 26,2025 6:37 AM

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..