Telangana: అక్రమమైతే నేనే కూలుస్తా.. ఫామ్‌ హౌస్‌లపై కొనసాగుతున్న రాజకీయ రగడ..

|

Oct 04, 2024 | 8:44 PM

తెలంగాణలో హైడ్రా హీట్ కొనసాగుతోంది. అధికార పార్టీ నేతల ఫామ్ హౌస్‌లపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండటంతో.. కొందరు నేతలు క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తమ ఫామ్ హౌస్ లపై క్లారిటీ ఇచ్చారు.

Telangana: అక్రమమైతే నేనే కూలుస్తా.. ఫామ్‌ హౌస్‌లపై కొనసాగుతున్న రాజకీయ రగడ..
Congress BRS
Follow us on

తెలంగాణలో హైడ్రా హీట్ కొనసాగుతోంది. అధికార పార్టీ నేతల ఫామ్ హౌస్‌లపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండటంతో.. కొందరు నేతలు క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తన ఫామ్ హౌస్ ప్రభుత్వ నిబంధనల మేరకే ఉందన్నారు. ఒకవేళ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నట్లయితే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానన్నారు. ఇరవై ఏళ్ల క్రితమే అన్నీ పరిశీలించి, అధికారులతో కూడా చర్చించి ఫామ్ హౌస్ నిర్మించామన్నారు పట్నం మహేందర్ రెడ్డి. ఈ మధ్య సర్వే చేసి బఫర్ జోన్‌లో లేదని అధికారులు నివేదిక ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి తన పేరు తెరపైకి తెచ్చి ఆరోపణలు చేస్తున్నారని, తన ఫామ్‌హౌజ్ రూల్స్‌కు విరుద్ధంగా అక్కడే కూల్చేద్దామన్నారు.

తనకు మినహాయింపులు వద్దని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ

మరోవైపు సీఎం రేవంత్ తన ఫామ్ హౌస్ కూల్చివేత అంశాన్ని ప్రస్తావించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పందించారు. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతిస్తున్నానని అన్నారు. కొంత మంది నేతలు వారి స్వప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారన్నారు. మూసీ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరేనని ప్రజలందరికీ తెలుసని లేఖలో ప్రస్తావించారు. అక్రమమైతే తానే దగ్గరుండి కూలుస్తానని చెప్పారు.న

అధికార పార్టీ నేతలు తమ ఫామ్ హౌస్‌ల విషయంలో ప్రభుత్వానికి, విపక్షాలకు వివరణ ఇస్తుండటంలో.. ఇంకెంతమంది నేతలు ఈ జాబితాలో చేరిపోతారో అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బీఆర్ఎస్ నేతలు పదే పదే అధికార పార్టీ నేతల ఫామ్ హౌస్‌ల గురించి ప్రస్తావిస్తుండటంతో.. ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..