
హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో జరిగిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్యోదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హరిహర కృష్ణ అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన ప్రాణ స్నేహితుడు నవీన్‌ను నమ్మించి.. అత్యంతం దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తాను ప్రేమించిన అమ్మాయితో మాట్లాడుతున్నాడనే కోపంతో స్నేహితుడు నవీన్‌ని దారుణంగా హత్య చేశాడు.
ఇదిలా ఉంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ మర్డర్ కేసులో స్నేహితుడు నవీన్‌ని అత్యంత క్రూరంగా హతమార్చన హరిహర కృష్ణను తీసుకెళ్లి, కేసుని రీకన్‌స్ట్రక్షన్ చేశారు పోలీసులు. SOT కార్యాలయం నుంచి హరిహర కృష్ణను అర్థరాత్రి బయటకు తీసుకెళ్లారు. మొదట మూసారంబాగ్‌లోని సోదరి ఇంటికి హరిహరను తీసుకు వెళ్లిన పోలీసులు… నవీన్‌ని చంపిన తీరుని రీకన్‌స్ట్రక్షన్ చేయించారు. మూసారం బాగ్‌లోని హరిహర సోదరి ఇంట్లోనే హరిహరతో పాటు అతని సోదరినీ పోలీసులు విచారించారు. అక్కడి నుంచి అంబర్ పేట్ లోని తిరుమల వైన్స్ వరకు హరిహరను తీసుకు వెళ్లారు. ఆ తరువాత తిరుమల వైన్స్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ మర్డర్ స్పాట్ కు హరిహరను తరలించారు.
మర్డర్ స్పాట్‌లో హత్య జరిగిన తీరును చూపించాలన్నారు పోలీసులు. నవీన్ మర్డర్ తరువాత అక్కడి నుండి బ్రాహ్మణ పల్లి లోని అతని స్నేహితుడు హాసన్ ఇంటికి వెళ్లి హరిహర రక్తపు మరకలున్న బట్టలు మార్చుకున్నాడు. దీంతో హరిహరను హాసన్ ఇంటికి తీసుకెళ్లి… అక్కడేం జరిగిందో చూపించమన్నారు పోలీసులు. హాసన్ ఇంట్లో సాక్ష్యాల కోసం గాలించారు పోలీసులు.. అర్థరాత్రి మర్డర్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ అనంతరం తిరిగి ఎస్‌ఓటి కార్యాలయానికి హరిహర కృష్ణను పోలీసులు తరలించారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..