Allu Arjun: అల్లు అర్జున్ నివాసంపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

|

Dec 22, 2024 | 10:42 PM

Allu Arjuns: అల్లు అర్జున్‌ సెక్యూరిటీ, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలతో అల్లు అర్జున్‌ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. ఇంటి రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి రాళ్లు, టమాటాలు విసిరారు. పూలకుండీలను ధ్వంసం చేశారు..

Allu Arjun: అల్లు అర్జున్ నివాసంపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
Follow us on

అల్లు అర్జున్‌ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సంధ్య థియేటర్‌ ఘటనలో నేపథ్యంలో అల్లు అర్జున్‌ నివాసం ముందు ఓయూ జేఏసీ విద్యార్థులు నిరసనకు దిగారు. బన్నీ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు. ఇంట్లోకి వెళ్లి పూలకుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్‌ వాల్‌ ఎక్కి అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు కాంపౌండ్‌ వాల్‌ ఎక్కి అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థులు.

హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు బన్నీ ఇంటికి చేరుకొని ఘటన వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే ఈ దాడి అనంతరం అల్లు అర్జున్ తన పిల్లలను తన మామ ఇంటికి తరలించినట్టు సమాచారం. ఫ్లకార్డ్సుతో ఇంటి గేటు ముందు నిరసనకు దిగారు.

ఈ దాడి ఘటన నేపథ్యంలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వెస్ట్‌ జోన్‌ డీసీపీ తెలిపారు. వారిపై చట్ట రీత్య చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి దాడులకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి