Hyderabad: వాహనదారులకు అలర్ట్‌.. ఈ రోజు అటువైపు ఎవ్వరూ రావొద్దు. పోలీస్ శాఖ ఆదేశం..

|

Feb 13, 2022 | 9:48 AM

Hyderabad: ఆదివారం హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ముచ్చింతల్‌ శ్రీ రామానుజ జీయర్‌ ఆశ్రమాన్ని భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు..

Hyderabad: వాహనదారులకు అలర్ట్‌.. ఈ రోజు అటువైపు ఎవ్వరూ రావొద్దు. పోలీస్ శాఖ ఆదేశం..
Hyderabad Traffic
Follow us on

Hyderabad: ఆదివారం హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ముచ్చింతల్‌ శ్రీ రామానుజ జీయర్‌ ఆశ్రమాన్ని భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే సాధారణ ప్రజల ఎవరు ఈ రోజు ఆశ్రమంవైపు రావద్దని పోలీసులు ఆదేశించారు. రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్‌ కారణాల దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఈ మార్గంలో ఎవరినీ అనుమతించడం లేదు. ఈ సమయంలో అటుగా వచ్చే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఇక ఆశ్రమానికి వచ్చే వీఐపీ వ్యక్తుల వాహనాల పార్కింగ్ కోసం పోలీసు శాఖ ప్రత్యేకంగా స్థాలాలను కేటాయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ పట్టణం నుంచి ఆశ్రమానికి వచ్చే వారు తమ వాహనాలను స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ వెనకాల పార్క్‌ చేయాలని సూచించారు. ఇక విజయవాడ, నల్గొండ నుంచి వచ్చే వాహనాలు పెద్ద గోల్కొండ ఎగ్జిట్‌15 నుంచి ఆశ్రమం రోడ్డులో గొల్లూరు గ్రామంలో పార్క్‌ చేయాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే రాష్ట్రపతి సమతామూర్తి విగ్రహం వద్దకు ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు చేరుకోనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అనంతరం రాష్ట్రపతి శ్రీ లక్ష్మీనారాయణ మహాయగ్నంలో పాల్గొననున్నారు.

Also Read: AP Latest Jobs 2022: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో నెలకు రూ.37 వేల జీతంతో ఉద్యోగాలు.. పదో తరగతి అర్హతతోనే!

Elon Musk Video: యావత్‌ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న ‘ఎలన్‌ మస్క్‌’నే భయపెట్టిన 19 ఏళ్ల కుర్రాడు..!(వీడియో)

Assembly Elections: 5 రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ఊరట.. నిబంధనలు సడలించిన కేంద్ర ఎన్నికల సంఘం