Monkey Funny Video: టెడ్డీ బేర్ చూసి భయంతో వణికిపోయిన కోతి.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వడం ఖాయం..
సాధారణంగా కోతులు చేసే అల్లరి చేష్టలు నవ్వులు తెప్పిస్తాయి. అప్పుడప్పుడూ వాటి చేష్టలతో ఇతర జంతువులను, మనుషులను కూడా భయపెడతూ ఉంటాయి. అయితే జంతువులను.. మనుషులను చూసి బయటపడని కోతి… ఓ చిన్న టెడ్డీ బేర్‌ను చూసి భయంతో పారిపోయింది...
సాధారణంగా కోతులు చేసే అల్లరి చేష్టలు నవ్వులు తెప్పిస్తాయి. అప్పుడప్పుడూ వాటి చేష్టలతో ఇతర జంతువులను, మనుషులను కూడా భయపెడతూ ఉంటాయి.అయితే జంతువులను.. మనుషులను చూసి బయటపడని కోతి… ఓ చిన్న టెడ్డీ బేర్‌ను చూసి భయంతో పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మీరు కడుపుబ్బ నవ్వడం మాత్రం ఖాయం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపై ఆగి ఉన్న కార్లపై నుంచి ఓ కోతి గెంతుతూ తెగ ఎంజాయ్ చేస్తుంది. అలా గెంతుతూ.. గెంతుతూ . ఓ కార్ సైడ్ గ్లాస్ పైకి వచ్చి కూర్చుంది. ఈ కోతిని చూసి ఆ కారులో ఉన్న చిన్నారి భయపడ్డాడు. దానిని కారుపైనుంచి దిగమని బెదిరించాడు కూడా.. అయినా అది దిగలేదు దాంతో ఆ చిన్నారి తన దగ్గర ఉన్న టెడ్డీ బేర్ బొమ్మను ఆ కోతికి చూపించాడు. దాన్ని చూసి భయపడిన కోతి దెబ్బకు కారు మీదనుంచి దూకి పరుగు లంకించుకుంది. ఈఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

