Hyderabad: ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే అంతే సంగతులు

వేసవి కాలం(Summer).. ఎండలతో పాటు సెలవులనూ మోసుకొచ్చే సమయం. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో కొందరు వారి స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఇదే సమయంలో ఎండాకాలంలో దొంగతనాలూ(Theft) ఎక్కువగా జరుగుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు,...

Hyderabad: ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే అంతే సంగతులు
Theft Tandur

Updated on: Apr 20, 2022 | 6:25 PM

వేసవి కాలం(Summer).. ఎండలతో పాటు సెలవులనూ మోసుకొచ్చే సమయం. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో కొందరు వారి స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఇదే సమయంలో ఎండాకాలంలో దొంగతనాలూ(Theft) ఎక్కువగా జరుగుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, విహార యాత్రలతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్తుంటారు. ఎక్కువ మంది పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎండాకాలంలో ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక ఆరుబయట, డాబాలపై నిద్రిస్తుంటారు. ఇదే సమయాల్లో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తారు. చెడ్డీ, పార్థూ గ్యాంగులంటూ పలు దొపిడీ ముఠాల వార్తలు పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లు, నిర్మానుష్య ప్రదేశాల్లో ఉండే, తరచూ ప్రయాణాలు చేసేవారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుని పరారవుతున్నారు. దీంతో నేరాలు, దొంగతనాలు జరగకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. ఊరెళ్లేవారూ కొన్ని జాగ్రత్తలూ పాటించాల్సిందేనని సూచిస్తున్నారు.

ఊరు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటికి పటిష్టమైన తాళాలు వేసుకోవాలి. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు వారి సూచనలు తప్పక పాటించాలి. దీంతో లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం కింద కెమెరాలు ఏర్పాటు చేస్తారు. దీని వల్ల దొంగల్ని పట్టుకోవడం సులభం అవ్వడమే కాక దొంగతనాలకు ఆస్కారం తక్కువగా ఉంటుంది. అర్థరాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు పదే పదే తలుపులు బాదినా, పగలగొట్టి లోనికి చొరబడినా అత్యవసర సర్వీసులు వినియోగించుకోవాలి. ఇలాంటి సమయాల్లో దొంగలను ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండా 100, 101, 108 తో పాటు స్థానిక పోలీసు స్టేషన్‌ నెంబర్లకు ఫోన్‌ చేయాలి. దొంగతనాలు జరగకుండా చూడడంలో కాపలాదారుడు ముఖ్యం. అతను అప్రమత్తంగా ఉంటే దొంగతనాలు చాలా వరకు తగ్గుతాయి.

ఇంటి ఆవరణలోకి వచ్చే అనుమానిత వ్యక్తులను గుర్తించడం, వారి కదలికలను తెలుసుకుంటూ ఉండాలి. దొంగల ముఠాలు ఎంచుకునే అపార్టుమెంట్లపై ముందుగా రెక్కీ నిర్వహిస్తారు. ఇలాంటి సందర్భాల్లో కాపలాదారులు అప్రమత్తంగా ఉండాలి. అపార్టుమెంట్లలో సీసీ కెమారాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాల ఫుటేజీ సరిగా రికార్డు అవుతున్నాయో లేదో అప్పుడప్పుడూ సరి చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

Also Read

Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు.. ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..!

Costly Stock: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాక్ ఏంటో తెలుసా? ధర వింటే మూర్ఛ పోవాల్సిందే..

Prashant Kishor: సోనియా గాంధీతో నాలుగోవసారి ప్రశాంత్ కిశోర్ భేటీ.. కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైందా..?